ప్రముఖ బిలియనీర్ కూతురు కొన్న బిల్డింగ్ ఖరీదు తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

DLF Company Chairman KP Singh Daughter Purchased A Building For 435 Crores

10:39 AM ON 20th December, 2016 By Mirchi Vilas

DLF Company Chairman KP Singh Daughter Purchased A Building For 435 Crores

డబ్బు దేనికీ లెక్కలేదు. ఖర్చుకు అస్సలు వెనుకాడని రోజులివి. అందుకే అన్నాడు డబ్బుంటే కొండమీది కోతి దిగొస్తుందని .. ఇక అసలు విషయంలోకి వస్తే, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ కూతురు రేణుక తల్వార్ ఓ భారీ కొనుగోలుకు తెరలేపింది. న్యూఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్లోని 435 కోట్ల ఓ బంగళాను కమల్ తనేజా నుంచి రేణుక కొనుగోలు చేసింది. మొత్తం 4,925 స్వ్కేర్ మీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ఉంది. ఇందులో 1,189 స్క్వేర్ మీటర్లలో బంగళాను కట్టారు. ఒక్కో స్క్వేర్ మీటర్ను 8.8లక్షలకు ఆమె కొనుగోలు చేశారు. ప్రస్తుతమున్న విలువ ప్రకారం 1,189 మీటర్లలో ఉన్న ఒక్క బంగ్లా ధర 383 కోట్లు పలికింది. లటీన్స్ బంగ్లా జోన్లో రేణుక ఈ భవంతినికొంది. ఢిల్లీలో ప్రముఖులు నివాసముండే భవంతుల సముదాయం ఈ ప్రాంతం అని చెప్పాలి. దాదాపు 3వేల ఎకరాల్లో, వెయ్యి బంగ్లాలతో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే నివాసముంటుంటారు. రేణుక తండ్రి, డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్కు కూడా ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఇప్పటికే రెండు సొంత విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. వీటి విలువ కూడా కోట్లలో ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: 'ధృవ'లో….నెంబర్ “8” మీనింగ్ ఏమిటో తెలుసుకోండి

ఇవి కూడా చదవండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

English summary

Popular Businessman DLF Company Chairman's Daughter came into news by purchasing a building for 435 crores in New Delhi. The total area of this house was 4925 Square Meters.