స్టాలిన్ చేతికి డీఎంకే పగ్గాలు

DMK party rights are into Stalin

11:36 AM ON 4th January, 2017 By Mirchi Vilas

DMK party rights are into Stalin

తమిళనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓ పక్క దివంగత సీఎం జయలలిత మరణంతో అన్నా డీఎంకే పగ్గాలు శశికళ దక్కించుకోవడం తో పాటు ,సీఎం పీఠం పై కూడా కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విపక్ష డీఎంకే పార్టీలో కూడా వేగంగా కదలికలు వస్తున్నాయి. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఎన్నికయ్యారు. చెన్నైలోని అన్నా అరివాలయంలోని కలైజ్ఞర్ అరంగంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ స్టాలిన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయలలిత మృతితో తమిళనాడు రాజకీయాల్లో శూన్యం ఏర్పడినట్లు భావిస్తున్న నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సంవత్సరానికి ఒకసారి సర్వసభ్య సమావేశం, రెండుసార్లు కార్యవర్గ సమావేశం నిర్వహించాలి. ఆ మేరకు డిసెంబర్ 20న నిర్వహించడానికి డీఎంకే అధిష్ఠానం ఏర్పాట్లు చేయగా, పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆకస్మాతుగా అస్వస్థతకు గురికావడంతో సమావేశాన్ని ఈ నెల 4కు వాయిదా వేశారు.

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి: తమ్ముడ్ని పెళ్లి చేసుకున్న అక్క! ఇందులో ట్విస్టు ఏంటంటే..

ఇది కూడా చూడండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

After the death of Jaylalitha many changes took place in the party and still changes are going on.People are expecting that Shashikala is going to be CM also.