మనిషికి ఏడు జన్మలు నిజమేనా?

Do man has 7 births

10:53 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Do man has 7 births

దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదించుకోవడం అలాగే దెయ్యాలు - భూతాల గురించి ఎవరి వాదన వారు వినిపించడం తెల్సిందే. ఇక మనిషికి పునర్జన్మ ఉంటుందని, ఉండదని వాదనలు వినిపిస్తుంటాయి. అద్భుతమైన కాన్సెప్ట్. హిందూమతంతో పాటు, ఇతర సంస్కృతులు కూడా ఒక వ్యక్తి మళ్లీ, మళ్లీ ఈ భూమ్మీద పుడతారని చెబుతాయి. ఇక బుద్దిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిఫ్టియన్స్ లో చాలా ధృడమైన నమ్మకం ఉండనే ఉంది.
హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు చక్కటి ఉదాహరణ విష్ణువుగా కొందరు చెబుతారు.

మనిషి రూపంలో.. దశావతారాలు వున్నాయి. భూమ్మీద ఉండే దుర్మార్గులను నాశనం చేయడానికే విష్ణువు ఆయా కాలాల్లో అవతారం ఎత్తాడనీ అంటారు. అలాగే చాలామంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం చాలా కథలు చూశాం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం ఉంది. అది సాధ్యం కాదన్న భావం ఉంది. అయితే.. పునర్జన్మ గురించి.. కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలున్నాయి. హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నాశనం కాదు. శరీరం మరణించినా.. ఆత్మ బతికే ఉంటుందని చెబుతుంది. మనం బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట.

భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు చెప్పిన సంగతి కూడా తెల్సిందే. ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది మనం మన పూర్వ జన్మలోని మన కర్మను లేదా మనం చేసిన మంచి, చెడు పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి, మంచి కర్మ పొంది ఉంటే.. ఆత్మ మళ్లీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి చెడు పనులు చేసి, చెడు కర్మను పొంది ఉంటే.. అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చింది. చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు. కానీ.. కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉందని అంటారు.

ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే.. అతను లేదా ఆమె దయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాత పునర్జన్మ పొందుతారని కూడా చెబుతారు. హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణం ఉంది. ఎందుకంటే.. మరణం తర్వాత అతనికి ఈ జన్మ గురించి ఏమీ గుర్తుండకూదని.. దేహాన్ని కాల్చడం, లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్లీ.. ఈ మెమొరీస్ కోసం వెతుక్కోకుండా.. మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారని చెబుతారు. ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జిన్మంచడానికి అవకాశం ఉంటుంది.

శారీరకంగా మగవాళ్లు, ఆడవాళ్లు మాదిరిగానే ఏడు సార్లు జన్మిస్తారు. అయితే వాళ్లు చేసిన మంచి, చెడు పనులను బట్టి.. వాళ్ల తర్వాత జన్మ ఆధారపడి ఉంటుందని కూడా అంటారు. బిడ్డ పుట్టాక పూర్వ జన్మ గుర్తు ఉంటుందని అందుకే బొడ్డు కోస్తారని కొందరు గుర్తుచేస్తారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చనిపోయిన వెంటనే.. ఆత్మ మరో శరీరరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత.. కొత్త శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుంది. మహర్షుల ప్రకారం.. మన గత జన్మ గురించి ప్రతీది మనకు గుర్తు ఉంటుంది.

కానీ కొంతమందికి మాత్రమే.. పూర్వ జన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే.. మన పూర్వ జన్మల గురించి మన అన్ కాన్సియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటాయన్నమాట.

English summary

Do man has 7 births