ఇవి అత్యంత అశ్లీలమైన పదాలు - వీటిని గూగుల్‌లో వెతికితే జైలు శిక్ష ….!

Do Not Search These Words On Google

11:55 AM ON 28th December, 2016 By Mirchi Vilas

Do Not Search These Words On Google

తెలీని విషయాన్ని తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ అనవసరమైన , అశ్లీలమైన వాటికోసం తెలుసుకోవాలని ప్రయత్నించడం తగదు. దీనివలన లాభం కన్నా నష్టమే ఎక్కువ. నిజానికి ఒకప్పుడంటే మనకు ఏ విషయం గురించైనా తెలియకపోతే మనకు సమీపంలో ఉన్న లైబ్రరీకో లేదంటే పేపర్, మ్యాగజైన్ వంటి వాటిని చదివో లేకపోతే ఎవర్నైనా అడిగో సదరు విషయాన్ని తెలుసుకునే వాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ఫోన్లు వచ్చాయి. మనకు ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్లో వెదికి పట్టుకునేందుకు, దాని గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు అనేక సెర్చ్ ఇంజన్లు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ప్రధానమైంది గూగుల్. దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో చాలా మంది గూగుల్ సెర్చ్ సైట్‌నే ఆశ్రయిస్తున్నారు. ఏ విషయం తెలియకున్నా గూగుల్లోకి వెళ్తే చాలు, ఇట్టే తెలుసుకునే వెసులు బాటు కలిగింది. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు నిత్యం తమకు కావల్సిన సమాచారాన్ని పొందాలంటే, కేరాఫ్ గూగుల్ అయింది కదా.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ ఒకే విషయం గురించి ఆన్లైన్లో వెదకరు కదా. ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి వెదుకుతారు. తమకు ఉన్న ఆసక్తిని బట్టి వారు గూగుల్‌లో శోధిస్తుంటారు. కొందరు సినిమాలు వెతికితే, ఇంకొందరు పాటలు, ఇంకొందరు పుస్తకాలు, ఇంకొందరు వంటల రెసీపీలు, ఇంకా కొందరు చదువుకునే పుస్తకాలు, మరికొందరు ఫొటోలు… ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్‌లో యూజర్లు వెతికే పదాల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అయితే ఆ పదాల లిస్ట్‌నే కీవర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏ కీవర్డ్ గురించి వెతికినా తప్పు లేదు, కాదు. కానీ కొన్ని కీ వర్డ్స్‌తో మాత్రం గూగుల్‌లో వెతకకూడదట. అవేమిటంటే…

4 గర్ల్స్ ఫింగర్ పెయింట్, లెమన్ పార్టీ, బ్లూ వాల్ఫ్, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్, ఎలె గర్ల్, టూబ్ గర్ల్, 2 గర్ల్స్ ఇన్ వన్ కప్ తదితర పదాలను గూగుల్‌లో వెతకకూడదట. అలా వెదికినా గూగుల్ ఎలాంటి శోధనలు, ఫలితాలు చూపదట. అలా సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంతకీ వీటి గురించి ఎందుకు వెతక కూడదంటే అవి మిక్కిలి అశ్లీలమైన పదాలట. చదివేందుకు అంతగా అశ్లీలంగా లేకున్నా వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ సదరు కీవర్డ్స్‌ను తమ లిస్ట్‌లో నుంచి తీసేసింది. అయితే ఇవే కాదు, టెర్రరిజానికి చెందిన పదాలను కూడా గూగుల్‌లో వెతకకూడదట. లేదంటే వాటిని బాగా వెతుకుతూ ఉంటే యూజర్లపై నిఘా వ్యవస్థ ఓ కన్నేసి ఉంచి, అవసరం వస్తే అలాంటి వారిని అరెస్టు చేస్తుందట. కాబట్టి జాగ్రత్త. మీరు గనక అలాంటి పదాలను వెతుకుతూ ఉంటే ఇకపై వాటిని అలా వెదకడం ఆపేయండి. లేదంటే మీకూ ముప్పు తప్పకపోవచ్చ ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పదాల పట్ల తస్మాత్ జాగ్రత్త.

ఇది కూడా చూడండి: గడ్డం బాగా పెరగాలన్నా, అందంగా ఉండాలన్నా ఇలా చెయ్యండి..

ఇది కూడా చూడండి: ముఖం మీద రంద్రాలను తొలగించటానికి చిట్కాలు

English summary

Do Not Search These Words On Google.