కలలు కలర్లో వస్తాయా..?

Do People Dream In Color or Not

11:44 AM ON 30th December, 2016 By Mirchi Vilas

Do People Dream In Color or Not

ఇలాంటివి వింటుంటే, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి…కలలకు రంగులు అద్దడం అంటే మరి మామూలు విషయం కాదు కదా. వాస్తవానికి కొన్ని కలలు భయాన్ని పురికొల్పుతాయి…మరికొన్ని వింతైన అనుభూతిని కలిగిస్తాయి. ఏది ఏమైనా, భూమిపై పుట్టిన ప్రతి మనిషికి నిద్రపోతే కచ్చితంగా కలలు వస్తాయి. కలలు రాని వ్యక్తులు అస్సలే ఉండరు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి వచ్చే కలలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే చాలా వరకు కలలను ఎవరూ గుర్తుపెట్టుకోలేరు. వెంటనే మరిచిపోతారు. కానీ ఏ కల వచ్చినా… అది మనకు బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుందా..? లేదంటే కలర్లో కనిపిస్తుందా..? అనేది ఓ చర్చ అయింది. అసలు ఇంతకీ వివరాల్లోకి వెళ్తే,...

సాధారణంగా మనకు వచ్చే కలలు అన్నీ దాదాపు కలర్లోనే ఉంటాయట.ఎందుకంటే, 80 శాతం వరకు కలలన్నీ రంగుల్లోనే ఉంటాయట. కేవలం 20 శాతం కలలు మాత్రమే బ్లాక్ అండ్ వైట్లో వస్తాయట. కానీ ఏ రంగు కల వచ్చినా మనకు ఆ రంగు అస్సలు గుర్తుండదట. కేవలం కలల్లో వచ్చే పలు భావాలు మాత్రమే మనకు గుర్తుంటాయట. అంటే మనం కలలో భయ పడింది, నవ్వింది, పరిగెత్తింది, నడిచింది… లాంటి క్రియలకు చెందిన భావాలు మాత్రమే గుర్తుంటాయట. అయితే బ్లాక్ అండ్ వైట్ లో కలలు ఎందుకు వస్తాయనేది మాత్రం ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు.

ఇక కొందరు మహిళలు, వృద్ధులు, అంధులు, పిల్లలు… వంటి వారికి బ్లాక్ అండ్ వైట్ లో కలలు వస్తాయట. దీనికి కూడా సరిగ్గా కారణాలు తెలియవు. అయితే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్లో ఉన్నవారికి కూడా కలలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా బాగా హెల్దీగా ఉన్నవారికి 99 శాతం వరకు కలలు రంగుల్లోనే వస్తాయట. అయితే బ్లాక్ అండ్ వైట్లో ఎవరికైనా కల వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదట. వాటితో అంత చింతించాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: చిలుకూరి బాలాజీ గురించి ఆసక్తికర తెలీని విషయాలు

ఇది కూడా చూడండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

ఇది కూడా చూడండి: ఇవన్నీ అబద్ధాలే ... 2016 లో చక్కర్లు కొట్టిన ఘటనలు

English summary

Do People Dream In Color or Not.?Here we placed Some Facts About Dreams.