ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు!

Do this when dangerous snake was bites

03:56 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Do this when dangerous snake was bites

మాములుగా 90 శాతం మనుషులకి పాము కాటేస్తుందన్న భయం కంటే, దాని ఆకారం చూసి భయపడే వాళ్ళే ఎక్కువ. అందుకే పాము కాటేయకుండానే భయంతో చనిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మందికి పైగా పాము కాటుకు గురౌతున్నారు. ఇండియాలో అయితే ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 సర్పాలు అత్యంత విషం కలిగి ఉన్నాయి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతాడు.

1/5 Pages

ఎన్ని గాట్లున్నాయో చూడాలి

అయితే కరిచిన పాము విషపూరితమైనదా? లేక విషరహితమైనదా? అని తెల్సుకోవాలంటే ముందుగా అది కాటేసిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపూరితమైన సర్పం అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.

English summary

Do this when dangerous snake was bites