కొత్త నోట్ల.. ప్రింటింగ్ ఖర్చెంతో తెలిస్తే షాకవుతారు

Do you how much it costs to print a new 2000 and 500 rupees notes

11:08 AM ON 21st December, 2016 By Mirchi Vilas

Do you how much it costs to print a new 2000 and 500 rupees notes

నవంబర్ 8న పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన కేంద్రం, వాటి స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లు ప్రవేశపెట్టింది. ఇప్పటికే అసలు నవంబర్ 8నాటికి ఎన్ని నోట్లు వున్నాయి వంటి వాటిపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు అందించాడు. అయితే వీటి ప్రింటింగ్ కు ఎంత ఖర్చవుతుందో అన్నది ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని నీముచ్ కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ సమాచారం పొందాడు.

ఆర్బీఐ ఆధ్వర్యంలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి సమాధానం ఇచ్చింది. పాత రూ.500 నోటు మాదిరిగానే కొత్త రూ.500 నోటు ప్రింటింగ్ కు రూ.3.09, కొత్త రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 చొప్పున ఖర్చవుతోందని పేర్కొంది. వెయ్యి రూ.500 నోట్ల ముద్రణకు రూ.3090, వెయ్యి రూ.2000 నోట్ల ప్రింటింగ్ కు రూ.3540 ఆర్బీఐ చెల్లిస్తోందని ముద్రణా సంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి : సంతానం పొందాలంటే ఇవి తినాల్సిందే...

ఇది కూడా చదవండి : రేచీకటి, కీళ్ల నొప్పులు తగ్గించే దివ్యౌషధం ఇదే..!

ఇది కూడా చదవండి : భార్యల కన్నా భర్తల వయస్సు ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా?

English summary

Recently a man from Madhya Pradesh questioned government that how it costs to print a single 2000 and 500 rupees notes and he got to know the answer.