పోలి స్వర్గానికి వెళ్లడం అంటే ఏమిటో తెలుసా?

Do you know about the similar to the paradise

12:39 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Do you know about the similar to the paradise

పరమ పవిత్ర కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు. అందుకే స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ ఒకటి వుంది. జానపద కథలా అనిపిస్తూ వినడానికి చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసిన నీళ్ళు పోసికాని దీనిని వదులుతూ ఈ కధను చదువుకోవాలని పండితులు చెబుతారు.

తరువాత కథ అక్షింతలు తల మీద వేసుకోవాలని అంటారు. అయితే అందరూ ఇలా ఆచరించడం లేదు ఒక్కోచోట వీలుని బట్టి ఒక్కోవిధంగా అనుసరిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే...

1/7 Pages

ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలు పేరు పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. అయితే పూలు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేదట. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది.

English summary

Do you know about the similar to the paradise