తిరుమలలో అనంతాళ్వార్ తోట గురించి తెలుసా?

Do you know Ananthalwar garden in Tirumala

12:11 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Do you know Ananthalwar garden in Tirumala

తిరుమలలో స్వామి వారికి నిత్యం పూలు సమర్పించి సేవ చేసుకునే భాగ్యం పొందిన తొలి భక్తుడు అనంతాళ్వార్. స్వామి వారికి పుష్ప కైంకర్య విధానాన్ని అమలు చేసినది అనంతాళ్వారేనని చెబుతారు. ఈ విధానాన్ని నేటికీ తిరుమలలో కొనసాగిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెనుక వైపు అనంతాళ్వార్ నివసించే వారు. స్వామికి పూలు సమర్పించుకునేందుకు పూల తోట వేసి, దానికి నీటి కోసం బావి తవ్వాలని అనుకున్నారట. భార్యతో కలసి స్వయంగా బావి తవ్వే పని ప్రారంభించారు. ఈ పనిలో సాక్షాత్తూ శ్రీహరి బాలుడి రూపంలో వచ్చి సాయం చేయడం విశేషం. అయితే, బావి తవ్వే పనిలో సాయం చేస్తానంటూ ఓ బాలుడు వచ్చి అనంతాళ్వార్ తో అనగా, ఆయన తిరష్కరిస్తారు.

1/4 Pages

దీంతో బాలుడి రూపంలో వచ్చిన స్వామి వారు అనంతాళ్వార్ భార్యకు సాయం చేస్తారు. దీంతో ఆగ్రహించిన అనంతాళ్వార్ బావి తవ్వే గునపాన్ని బాలుడిపైకి విసరగా, స్వామి వారి గడ్డానికి గాయమైనట్టు చెబుతారు.

English summary

Do you know Ananthalwar garden in Tirumala