చేపకు వేళ్ళుంటాయా 

Do you know fish have fingers

11:46 AM ON 24th November, 2015 By Mirchi Vilas

Do you know fish have fingers

చేపకు వేళ్ళుంటాయా అని ఇదే ప్రశ్నను ఎవరైనా అడిగారనుకోండి మీరు ఎలా చూస్తారు వారిని. వాళ్ళ అమాయకత్వాన్ని చూసి మనం హవ్వా అని తీరాల్సిందే. కానీ ఇలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆహారానికి సంబంధించి శాస్త్రవేత్తలు యువతపై చేసిన పరిశోధనలలో తేలిందేమిటంటే చాలా మందికి తాము తినే ఆహారం ఎలా వస్తుందో సరిగా అవగాహన ఉండడం లేదట. బ్రిటన్‌ కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలిందేమిటంటే ప్రతీ ముగ్గురిలో ఒకరికి అసలు తాము తినే కొన్ని ఆహార పధార్థాలలో ఏమి ఉంటుందో, అవి ఎలా తయారు అవుతాయో కూడా తెలియవట. ఉదాహరణకు ఫిష్‌ ఫింగర్‌ అనబడే ఆహార పదార్ధం చేప వేళ్ళ నుండి తయారు చేస్తారేమో అనుకుంటారట చాలామంది. యుకెలోని ప్రతీ ఐదుగురిలో ఒక్కరు ఇలా తప్పుడుగా అర్థం చేసుకుంటారట. ఇక 25శాతం మంది అయితే తేనెటీగలను చంపి వాటిని పిండి తేనె తయారుచేస్తారని అనుకుంటారట. 9శాతం మంది బంగాళాదుంపలు చెట్లకు కాస్తాయి అనుకుంటారట. పోర్క్‌చాప్స్‌ అనే ఆహారం పంది మాంసం నుండి వస్తుందని 15శాతం మందికి అస్సలు తెలియదట.

ఇలా చాలామందికి తాము తినే ఆహారం పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడానికి కారణాలు లేకపోలేదని అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రులు సరిగ్గా తమ పిల్లలకు కూడా ఆహారపధార్ధాల గురించి వివరించలేక పోవడంతో ఇది జరుగుతుందట. 22శాతం తల్లిదండ్రులు ఇలాంటి అవగాహన లేమితో ఉన్నారట. ఈ పరిశోధనను 16నుండి 24 యేళ్ళ వయస్సు గల యువతీ యువకుల మీద శాస్త్రవేత్తలు జరిపారు.

English summary

Some people think like fish fingers are actually made from fish fingers