తప్పనిసరిగా  తెలుసుకోవలసిన పాదాల ట్రిక్స్ మరియు టిప్స్

Do you know foot tricks

06:14 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Do you know foot tricks

పాదాలు అనేవి మన శరీరంలో మనోహరమైన బాగాలు. ఎముకలు, మృదు కణజాలాలు, కండరాలు మరియు కీళ్ళతో ఉండే పాదాలు మన రోజువారీ జీవితంలో ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. మనం నడవటానికి,నిలబడటానికి, రన్నింగ్ చేయటానికి, జాగింగ్ చేయటానికి సహాయపడతాయి. అటువంటి పాదాల గురించి కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం.

1/11 Pages

1. పడుకొనేటప్పుడు పాదాల మిద  బ్లాంకెట్ కప్పకూడదు

రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత పడిపోవటం వలన అది నిద్రకు దోహదం చేస్తుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట వలన లోతైన నిద్ర ఉంటుంది. అధిక శరీర ఉష్ణోగ్రత నిద్రను ఆటంకపరుస్తుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత మానసిక, శారీరక పనితీరుల మీద ప్రభావాన్ని చూపుతుంది. కాఫీ త్రాగటం వలన శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగి నిద్రను నిరోధిస్తుంది. పాదాల వేడిని తగ్గించటం ఎలాగో తెలుసుకుందాం

*  పాదాల అడుగున జుట్టు లేకపోవుట వలన వేడి పెరుగుతుంది.
* పాదాల చర్మం ఉపరితలం క్రింద రక్తం సరఫరా చేయటానికి  ధమని సిరల కలయకతో లెక్కలేనన్ని ప్రత్యేక రక్త నాళాలు ఉంటాయి. పాదాలకు దుప్పటి కప్పకుండా ఉంటే అప్పుడు చర్మం  ఉపరితలం క్రింది రక్తం  చల్లబడుతుంది. అప్పుడు శరీరం మొత్తం చల్లబడి నిద్ర బాగా పడుతుంది. ధమని సిర అడ్డు కలయికల ద్వారా శరీరం యొక్క మిగిలిన బాగాలకు సరఫరా అవుతోంది.

English summary

In this article, we have listed about some foot tricks an tips here .Your body temperature drops at nighttime and contributes to inducing sleep. As you drift into deep sleep, its temperature sinks even lower.Studies have shown that higher body temperatures are associated with inhibiting sleep.