11రోజుల్లో వెంకన్న ఆదాయం ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

Do you know how much earned by Lord Venkateswara in these 11 days

11:23 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Do you know how much earned by Lord Venkateswara in these 11 days

పెద్ద నోట్ల రద్దు, తగినన్ని చిన్న నోట్లు రాకపోవడం నేపథ్యంలో ప్రజలు ఓ పక్క ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. ఆదివారం భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం పరకామణి ద్వారా లెక్కించగా రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ లేకున్నా ఇంత భారీగా ఆదాయం రావడం ఆశ్చర్యపరుస్తోంది. పెద్ద నోట్లు చెల్లకపోవడంతో అవి కాస్తా హుండీకి చేరుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. రద్దీ రోజుల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లు దాటుతుంటుంది.

కానీ పెద్దనోట్ల రద్దు ప్రభావంతో భక్తులు తక్కువగా వస్తున్నా స్వామివారి హుండీ భారీ ఆదాయంతో కళకళలాడుతోంది. గడిచిన ఆరునెలల్లో ఇంత మొత్తంలో ఆదాయం లభించటం ఇదే మొదటిసారి కావడం అద్భుతం అంటున్నారు. నోట్లు రద్దయినప్పటి నుంచి 11 రోజుల్లో హుండీ ఆదాయం రూ.34.03 కోట్లు లభించింది. డిసెంబర్ నెలాఖరు దాకానే కాదు ఆతర్వాత కూడా హుండీ నిండిపోయే సూచనలున్నాయి.

English summary

Do you know how much earned by Lord Venkateswara in these 11 days