ఐఫోన్ ఖరీదు 60వేలు.. కానీ నిజంగా దానికయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకౌతారు!

Do you know how much it cost for i phone basic model manufacturing

03:03 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Do you know how much it cost for i phone basic model manufacturing

చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముకున్న చందంగా యాపిల్‌ & ఎన్బిఎస్పీ కూడా అదే చేస్తోందట. ఇదే విషయాన్ని ప‌లు టెక్ రీసెర్చ్ సంస్థ‌లు చెబుతున్నాయి. అయితే ఐఫోన్ల‌ను త‌యారు చేసే యాపిల్ కంపెనీకి  ఇదే సామెత ఎలా వ‌ర్తిస్తుందని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఐఫోన్‌ గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. ధ‌ర ఎక్కువ ఉంటుంద‌ని. ఇక దాన్ని వాడిన వారికైతే ఫీచర్స్ గురించి వాడేవారికి బానే తెలుస్తాయి. అయితే ఐఫోన్ విడుద‌లైన తొలి నాళ్ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వచ్చిన అన్ని మోడ‌ల్స్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో అంద‌రికీ తెలుసు. సాధార‌ణ మొబైల్ వినియోగ‌దారులెవ‌రూ ఊహించ‌ని రేంజ్‌ లో వాటి ధ‌ర‌లు ఉంటూ వ‌చ్చాయి.

ఇక ప్ర‌స్తుతం విడుద‌లైన ఐఫోన్ 7 బేసిక్ మోడ‌ల్(32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియెంట్‌) ధ‌ర ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.60వేలు. అక్టోబ‌ర్ 7న భార‌త మార్కెట్‌ లోకి అందుబాటులోకి రానుంది. అయితే అస‌లు ఈ ఫోన్‌ ను త‌యారు చేసేందుకు నిజంగా అంత ఖ‌ర్చ‌వుతుందో చూస్తే, ఐఫోన్ 7 బేసిక్ మోడ‌ల్‌ ను ఐహెచ్ఎస్ అనే ఓ టెక్ రీసెర్చ్ సంస్థ ఏ పార్ట్‌ కి ఆ పార్ట్ విడ‌దీసి అందులో ఉన్న హార్డ్‌ వేర్‌ ను మొద‌ట గుర్తించింది. వాట‌న్నింటినీ విడి విడిగా పెట్టి ఒక్కో దాని ఖ‌రీదును లెక్కించింది. వాటి వివరాలు ఇదిగో.. 

1/6 Pages

ఐఫోన్ కు అయ్యే ఖర్చు:

ఐఫోన్ 7 ప్రాసెస‌ర్ ధ‌ర – 26.90 డాలర్లు(1794 రూపాయలు)

బేస్‌ బ్యాండ్ ధ‌ర – 33.90 డాల‌ర్లు(2261 రూపాయలు)

బ్యాట‌రీ – 2.50 డాల‌ర్లు(166 రూపాయలు)

బ్లూటూత్‌, వైపై, ఇత‌ర క‌నెక్టివిటీ డివైస్‌ లు – 8 డాల‌ర్లు(533 రూపాయలు)

కెమెరాలు – 19.90 డాల‌ర్లు(1327 రూపాయలు)

డిస్‌ ప్లే – 43 డాలర్లు(2868 రూపాయలు)

యాంటెన్నా, క‌నెక్ట‌ర్లు, మైక్రోఫోన్‌, పీసీబీ, స్పీక‌ర్లు – 16.70 డాల‌ర్లు(1114 రూపాయలు)

సెమి కండ‌క్ట‌ర్లు – 1.30 డాల‌ర్లు(87 రూపాయలు)

ఎన్‌ క్లోజ‌ర్స్‌, లేబుల్స్‌, ఇన్సులేట‌ర్స్ తదిత‌రాలు – 18.20 డాల‌ర్లు(1215 రూపాయలు)

మెమోరీ(ర్యామ్‌, ఇంట‌ర్నల్ స్టోరేజ్‌) – 16.40 డాల‌ర్లు(1095 రూపాయలు)

ప‌వ‌ర్ మేనేజ్‌మెంట్ చిప్స్ – 7.20 డాల‌ర్లు(480 రూపాయలు)

ఆడియో, ఎన్ఎఫ్‌సీ, సెన్సార్లు – 14 డాల‌ర్లు(934 రూపాయలు)

అసెంబ్లింగ్‌, టెస్టింగ్ – 5 డాల‌ర్లు(334 రూపాయలు)

మొత్తం – 224.80 డాల‌ర్లు(15000 రూపాయలు)

English summary

Do you know how much it cost for i phone basic model manufacturing