అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చెంతో తెలిస్తే షాకౌతారు!

Do you know how much money spend for America president elections

11:59 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Do you know how much money spend for America president elections

ఎన్నికలన్నాక విరాళాల సేకరణ, వసూళ్లు ఖర్చులు ఉండడం సహజం. అయితే హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్థులు అనేక విధాలుగా భారీగా ప్రచారం చేశారు. దాదాపు ఏడాదిపాటు జరిగిన ఈ ప్రక్రియలో ఎవరెవరు ఎంతెంత ఖర్చు చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. డెమొక్రాటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2016 అక్టోబరు 19 వరకు సేకరించిన సొమ్ము, పెట్టిన ఖర్చుల వివరాలు బహిరంగ పరిచారు.

1/3 Pages

వాటి ప్రకారం చూస్తే, హిల్లరీ క్లింటన్ కాంపెయిన్ 556 మిలియన్ డాలర్లు(రూ. 3698.92 కోట్లు), డెమొక్రాటిక్ పార్టీ, జాయింట్ ఫండ్ రైజింగ్ కమిటీలు 544.4 మిలియన్ డాలర్లు(రూ. 3621.75 కోట్లు), సూపర్ పీఏసీలు 188 మిలియన్ డాలర్లు(రూ. 1250.71 కోట్లు) సేకరించాయి. ఈ నిధుల్లో అక్టోబరు 19 వరకు 93 శాతం ఖర్చు చేశారు.

English summary

Do you know how much money spend for America president elections