పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Do you know the cost of Pawan Kalyan's watch

09:45 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Do you know the cost of Pawan Kalyan's watch

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘అ.. ఆ..’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ చిత్రం ఆడియో సీడీలను తన చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరోహీరోయిన్లు నితిన్‌, సమంత ఆవిష్కరించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో కధానాయిక. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ఒక వాచ్ ను పెట్టుకుని రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పవన్ చేతికున్న వాచ్ చూసిన అభిమానులు దీని గురించి ఆరా తీయడం ప్రారంభించారు.

దీంతో వారికి అవాక్కయ్యే నిజం తెలిసింది. అదేంటంటే బ్రెట్లింగ్ బర్నాటో కంపెనీకి చెందిన ఈ వాచ్ గా విలువ దాదాపు 5000 డాలర్ల(3 లక్షల 33 వేలు) అని తెలుస్తోంది. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత ని కమెడియన్లు వేణు, ధన రాజ్ కిడ్నాప్ చేస్తారు. అక్కడ సమంత ఒక డైలాగ్ చెప్తుంది ఆయన పెట్టుకున్న వాచ్ అమ్మితే చాలు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని. ఇప్పుడు పవన్ పెట్టుకున్న వాచ్ గురించి మాట్లాడుతుంటే అందరికి ఆ డైలాగ్ గుర్తొస్తుంది.. సహజంగానే పవన్ వినియోగించే వస్తువుల పై యూత్ లో ఒక క్రేజ్ ఉంటుంది. దీంతో ప్రస్తుతం యువత ఫోకస్ పవన్ వాచ్ పై పడింది.

English summary

Do you know the cost of Pawan Kalyan's watch. In A.. Aa audio function Pawan Kalyan wears one watch. That watch cost is 3 lakhs 33 thousand rupees only.