28 బ్యాంకులకు కలిగిన నష్టం ఎంతో తెలుసా?

Do you know the loss of 28 banks

12:46 PM ON 3rd December, 2016 By Mirchi Vilas

Do you know the loss of 28 banks

నిత్యం ఆర్ధిక లావాదేవీల్లో మునిగితేలే బ్యాంకులకు భారీగానే నష్టాలు వచ్చాయట. ఏకంగా 28బ్యాంకులు నష్టాల్లో వున్నాయట. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.17,993 కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు తేలింది. ఈ విషయం ప్రభుత్వ గణంకాల ద్వారా వెల్లడైంది. శుక్రవారం లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 28 ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తం రూ.17,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూశాయి అని తెలిపారు. వీటిలో 14 బ్యాంకులు నష్టాలు వచ్చినట్లు తమ పుస్తకాల్లో గణాంకాలను నమోదు చేయగా, మిగిలిన బ్యాంకులు లాభాల కింద చూపినట్లు పేర్కొన్నారు.

బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులే నష్టాలకు ప్రధాన కారణం అని తేలింది. ఇక తమ పుస్తకాల్లో లాభాలుగా చూపిన బ్యాంకుల్లో ఎస్బీఐ రూ.9,951 కోట్లు, ఎస్బీహెచ్ రూ.1,065 కోట్లు, ఎస్బీబీజే రూ.851 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.540 కోట్లు ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా బ్యాంకులకు వచ్చే నాలుగేళ్లలో రూ.70వేల కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన చేసిందని గంగ్వార్ వెల్లడించారు. బ్యాంకుల వారీగా నష్టాలిలా వున్నాయి.

1/9 Pages

1. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,089 కోట్లు నష్టపోయింది.

English summary

Do you know the loss of 28 banks