భూమ్మీద ఉన్న బరువెంతో తెలిస్తే షాకౌతారు!

Do you know the weight that found on the earth

10:49 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

Do you know the weight that found on the earth

అంత బరువు మోశాం... ఇంత బరువు మోస్తున్నాం అని చాలామంది చెబుతుంటారు. కానీ భూమాత ఎంత బరువుని సహనంగా మోస్తోందో తెలిస్తే, షాకౌతారు. ఎందుకంటే, 30000000000000000 ఈ అంకెలు చదివి ఆ సంఖ్య ఎంతో చెప్పడం వెంటనే అయ్యే పనికాదు. ఒకటికి పదిసార్లు లెక్కించుకోవాలి. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం 30 ట్రిలియన్లు అన్నమాట. ఇక కేజీల్లో చెప్పాలంటే మీరు చదివి అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా అయితే 30 లక్షల కోట్లు. ప్రస్తుత భూగోళం బరువు ఇది. భూమ్మీద ఉన్న చిన్నాచితక నిర్మాణాలు సహా అన్నింటితో కలిపి భూగోళం బరువు 30 లక్షల కోట్ల బరువు(30 ట్రిలియన్ టన్నులు) ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది.

1/3 Pages

తాజా అధ్యయనం వివరాలు ఆంథ్రోపోసెనె రివ్యూ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్ లోని లీసెష్టర్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టుల అంతర్జాతీయ బృందం మొట్టమొదటిసారిగా భూమ్మీద ఉన్న అన్ని నిర్మాణాలను కలుపుకుని పూర్తి పరిమాణాన్ని అంచనా వేసింది.

English summary

Do you know the weight that found on the earth