శంఖం ప్రత్యేకత ఏమిటో తెలుసా

Do you know what is the importance of shankh

10:37 AM ON 5th January, 2017 By Mirchi Vilas

Do you know what is the importance of shankh

భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక్కో వస్తువుకి ఒక్కో ప్రాధ్యాన్యత వుంది. వీటిల్లో ప్రధానంగా శాఖ నాదం చేయడం చూస్తాం కదా. ఎందుకంటే, శంఖానికి విశిష్టమైన ప్రాధాన్యత వుంది. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే సమయంలో శంఖాన్ని వూదుతారు. మరి దీని విశిష్టత ఏమిటో చూద్దాం.

శంఖం నుంచి వెలువడే శబ్దం పలురకాల రుగ్మతలను నివారిస్తుందని పురాతన వైద్యశాస్త్రాలు తెలుపుతున్నాయి.

శ్రీమహావిష్ణువు శంఖం పాంచజన్యం ఎంతటి పవిత్రమైందో తెలిసిందే. ఇక శంఖం ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ వుంది. శంఖచూడుడనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో కృష్ణకవచాన్ని పొందాడు. ఆపై బలగర్వంతో స్వర్గంపై దండెత్తగా ఇంద్రుడు పరమేశ్వరుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. అంత విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసి తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని తెలుస్తోంది. శంఖంలో పోసిన నీరు కొద్ది గంటల తరువాత శక్తి గల నీరుగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లే 'శంఖంలో పోస్తేనే తీర్థం' అనే నానుడి వచ్చింది. శంఖాల్లోనూ పలు రకాలున్నాయి. దక్షిణభాగం తెరిచివుంటే దక్షిణావర్తశంఖం అంటారు. ఇది విష్ణువుకి, శివునికి ప్రీతపాత్రమైనది. శంఖాన్ని కిందపెట్టకుండా ఏదైనా పళ్లంలో పెట్టి పూజామందిరంలో వుంచాలి. శంఖాన్ని పవిత్రంగా చూసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఇది కూడా చూడండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి:4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

English summary

Do you know what is the importance of shankh.