మద్యం మత్తులో అల్లరి మూకలు ఏం చేశాయో తెలుసా?

Do you know What the crazy drunk and did?

10:59 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

Do you know What the crazy drunk and did?

డిసెంబర్ 31న అర్ధరాత్రి బెంగళూరులో పలువురు మహిళలు తీవ్ర వేధింపులకు గురయ్యారు. ముఖ్యంగా బెంగళూరు బ్రిడ్జిరోడ్డు, ఎంజీ రోడ్లలో మహిళలు నరకం చవిచూశారు. చుట్టుపక్కల దాదాపు 1500 మంది పోలీసులు ఉన్నా ఈ ఘటనలు చోటు చేసుకోవడం వింతగా వుంది. పలువురు వ్యక్తులు మహిళలపై అసభ్యకర పదజాలం వాడుతూ తిరిగారు. అసభ్యంగా ప్రవర్తించారు. ఇంకా పూర్తివివరాల్లోకి వెళ్తే,

నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయంలో తాగుబోతులు గుంపులు గుంపులుగా ఎంజీ రోడ్డులో స్వైరవిహారం చేశారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం కొందరు యువకుల గుంపు ఇద్దరు మహిళలను తీవ్రంగా వేధించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పలువురు మహిళలు ఏడుస్తూ కనిపించారు. వీరిలో చాలా మంది మహిళా పోలీసు అధికారుల వద్దకు పరుగులు తీశారు. ఈ గుంపులు ముఖ్యంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ మాత్రం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇది కూడా చూడండి : నెయ్యితో శిరోజాలకు రక్షణ... ఎలాగో తెలుసుకోండి..

ఇది కూడా చూడండి : మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చూడండి : బిర్యాని ఆకును కాల్చి గదిలో పెడితే ఒక అద్భుతాన్ని చూస్తారు!

English summary

Some people on December 31st Night they drunk and teased women on roads with vulgar language in Bangalore.