తిరుమల శ్రీవారి బ్రహ్మోత్స వేళల్లో ఏం చేస్తారో తెలుసా?

Do you know what will you do in Tirumala Brahmotsavas

04:15 PM ON 26th October, 2016 By Mirchi Vilas

Do you know what will you do in Tirumala Brahmotsavas

నిజానికి తిరుమలలో ప్రతీ రోజూ ఓ పండుగే. నిత్య, వార, పక్ష, మాస, వార్షికంగా సుమారు 450 పండుగలు తిరుమలలో జరుగుతాయి. వీటన్నింటిలోకి ప్రత్యేకమైనది బ్రహ్మోత్సవం. ఏటా తిరుమల బ్రహ్మాండనాయకునికి సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించే మహోత్సవమే ఇది. తాను సృష్టించిన ఈ జీవరాసిని కాపాడుతున్నందుకు బ్రహ్మే సంతోషంతో మొదటిసారి తిరుమల వెంకటేశ్వరస్వామి పాదాలను కడిగి ఈ సేవను ప్రారంభించినట్టు ఆలయ చరిత్ర, పురాణాలు చెబుతున్నాయి. అందుకే అన్నమయ్య బ్రహ్మకడిగిన పాదమూ అంటూ స్తుతించారు. ఏటా అశ్వీయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.

లక్షల సంఖ్యలో భక్తులు ఈ సమయంలో తిరుమలకు విచ్చేస్తుంటారు. ప్రతీ మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసాన్ని పురస్కరించుకుని ఆ ఏడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీ. అంటే ప్రతీ మూడేళ్లకోమారు ఒక ఏడాదిలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవంలో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

1/16 Pages

1. అంకురార్పణ...


ముందు అంకురార్పణ ఉంటుంది. మలయప్ప, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు తొమ్మిది రోజుల్లోనూ ఉదయం, రాత్రి వేళ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.

English summary

Do you know what will you do in Tirumala Brahmotsavas