2017 మొదటి చిన్నారిగా బ్రిటన్ లో ఎవరో తెలుసా?

Do you know who is the first child in 2017 Brtian?

10:40 AM ON 5th January, 2017 By Mirchi Vilas

Do you know who is the first child in 2017 Brtian?

పండంటి పాప పుడితే ఎవరికి మాత్రం సంతోషం ఉండదు మరి. సరిగ్గా అదేవిధంగా ఓ బుజ్జిపాపాయి జన్మించడమే తల్లిదండ్రులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. అంతేకాదు, ప్రపంచమంతా జరుపుకొనే నూతన సంవత్సరం సందర్భంగా జానించడం వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అందులోనూ దేశం కాని దేశంలో పుట్టిన చిన్నారి భారతీయురాలు అయితే ఆ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ లో జన్మించిన మొట్టమొదటి చిన్నారిగా భారత దేశ దంపతుల బుజ్జాయి ప్రత్యేకత చాటుకుంది.

బర్మింగ్ హమ్ లోని హ్యాండ్స్ వర్త్ లో నివాసం ఉండే అశ్వనీ కుమార్-భారతీ దేవీ దంపతులకు 2017 జనవరి ఒకటో తేదీ 12.01 గంటలకు పండంటి పాపాయి జన్మించింది. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత జన్మించిన మొదటి చిన్నారి ఈ పాపాయి అని స్థానిక మీడియా వెల్లడించింది. తమ బుజ్జాయి ఈ ప్రత్యేకతను సంపాదించుకోవడం పట్ల భారతీయ దంపతులు స్పందిస్తూ 2016 డిసెంబర్ 25 తర్వాత ప్రసవం అవుతుందని భావించామని అయితే కాన్పులో జాప్యం అయిందని తెలిపారు. ఈ విషయంలో మొదట తాము ఆందోళన చెందినప్పటికీ తర్వాత ఒక ప్రత్యేక సందర్భంలో తమకు చిన్నారి జన్మించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సంబరపడిపోయారు. కాగా, ఈ దంపతులకు ఇప్పటికే రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇప్పుడు పాప పుట్టి, సరికొత్త సంతోషం తెచ్చింది.

ఇది కూడా చదవండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చదవండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

ఇది కూడా చదవండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

English summary

Every year January 1st is a festival eve in Britain Generally. A child born on this day is really happy gift to Indian parents in Britain.