ఏటీఎంలలో రూ.500 నోట్లు లేకపోవడానికి కారణమేమిటో తెలుసా?

Do you know why 500 notes was not available in atm's

12:00 PM ON 26th November, 2016 By Mirchi Vilas

Do you know why 500 notes was not available in atm's

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల ముందు క్యూకడుతున్న ప్రజలకు రూ.2వేల నోట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల వందలు కూడా వస్తున్నాయి. ఇక కొన్ని ఎటిఎంలు అవుట్ ఆఫ్ ఆర్డర్ అని బోర్డు పెట్టివుంటున్నాయి. ఇక కొత్త రూ.500 నోట్లు కానరావడం లేదు. అయితే 500 కొత్త నోట్లు కనిపించకపోవడానికి కారణమేంటి? చాలామందికి వచ్చిన సందేహమే ఇది. దీనికి కారణం చాలా సింపుల్. రూ.2వేల నోట్లను రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని ప్రింటింగ్ ప్రెస్ లు ముద్రిస్తుండగా రూ.500 నోట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్ లోని దేవాస్ లలో ప్రింట్ అవుతున్నాయి. అంతేకాక రూ.500 నోట్ల ప్రింటింగ్ మొదలుకావడానికి ముందే రూ.2000 నోట్లు ప్రింట్ అయి బయటకు వచ్చేశాయి.

1/3 Pages

ఇక ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 9026.6 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటిలో ఇంచుమించు 24శాతం రూ.500, రూ.1000 నోట్లే కావడం విశేషం. రద్దయిన నోట్లను వేగంగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని భావించిన ఆర్బీఐ రూ.2వేల నోట్లు వేగంగా ముద్రించింది.అయితే రూ.500 నోట్లు రూ.2వేల నోట్లు అంతగా ప్రింట్ కాలేదన్న విషయం ఆర్బీఐకి అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. మరోవైపు ఆర్బీఐ నుంచి అందిన రూ.2వేల నోట్లను బ్యాంకులు ఏటీఎంలలో సర్దేశాయి.

English summary

Do you know why 500 notes was not available in atm's