ఏటీఎం పిన్ నెంబర్లు చేంజ్ చెయ్యకపోతే అంతే.. ఎందుకో తెలుసా?

Do you know why atm pin numbers will be changed

02:29 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Do you know why atm pin numbers will be changed

కస్టమర్ల పిన్ నంబర్లను మోసగాళ్ళు హ్యాక్ చేసి వారి డబ్బులను తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్న వైనంపై స్పందించిన ఈ బ్యాకులు అలర్ట్ అయ్యాయి. ఏటీఎం ఫ్రాడ్లపై కొన్ని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఖాతాదారులు తమ ఏటీఎం పిన్ నెంబర్లను మార్చుకోవాలని కోరుతూ ఈ-మెయిల్స్, టెక్స్ట్ మెసేజ్ లు పంపాయి. లేకుంటే, కొత్త పిన్స్ ను తమ కస్టమర్లకు పంపాలని ఇతర బ్యాంకులకు సూచించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ వంటివి తమ ఖాతాదారులకు ఈ మేరకు వార్నింగ్ మెసేజ్ లను పంపాయని ఓ ఇంగ్లీష్ డైలీ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా డెబిట్ కార్డుకు సంబంధించిన పిన్ ను మార్చుకోండన్నదే దీని సారాంశం.

ఇటీవల హైటెక్ పద్ధతుల్లో ఛీటర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. విదేశాల్లో ఉన్న ఓ మహిళ తన 55 వేల రూపాయలను ఎవరో తన అకౌంట్ నుంచి కాజేశారని ఫిర్యాదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకూర్ బ్రాంచ్ లో ఈమెకు ఖాతా ఉంది. అయితే ఈ నెల 3, 5 తేదీలలో ఈ డబ్బు తన అకౌంట్ నుంచి మాయమైందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఏటీఎం నుంచి పరాయి దేశంలో ఈ మొత్తాన్ని మోసగాళ్ళు స్వాహా చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇక కొందరు ఫారినర్స్ కూడా ఫ్రాడ్ స్టర్స్ గా మారుతున్నారు. రుమేనియాకు చెందిన ఓ వ్యక్తి మరో ఇద్దరు విదేశీయులతో కలిసి కొంతమంది డబ్బులను తన ఖాతాలోకి మళ్ళించుకున్నాడని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది. ఏటీఎంలోని ఓ ఎలక్ట్రానిక్ సాధనం వల్లే మోసగాళ్ళు సీక్రెట్ పిన్ కోడ్ ను, ఇతర వివరాలను చాకచక్యంగా సేకరిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి పిన్ నెంబర్లు మార్చడం ద్వారా కొంతైన అడ్డుకట్ట వేయాలని బ్యాంకులు భావించి ఇలా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: తన తల్లిని చంపిన హంతకుడ్ని పట్టించిన ఐదేళ్ల చిన్నారి.. ఇందులో ట్విస్ట్ వింటే దిమ్మతిరుగుద్ది!

ఇది కూడా చదవండి: బీజేపీ మహిళా నేతకు స్టేజిపై 'ఐ లవ్ యూ' చెప్పిన కుర్రాడు.. తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చదవండి: ఆర్మీలో మొదటి ట్రాన్స్ జెండర్ గా రికార్డుకెక్కిన అలెన్!

English summary

Do you know why atm pin numbers will be changed. Because hackers are hacking the accounts and trasfering money to their accounts