నోట్లలో చిప్ పెట్టాలనుకుని... ఎందుకు వెనక్కు తగ్గారో తెలుసా?

Do you know why didn't put nano chips in new currency

12:01 PM ON 1st December, 2016 By Mirchi Vilas

Do you know why didn't put nano chips in new currency

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ, ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నాక, కొత్త నోట్ల విషయంలో రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అందులో ముఖ్యంగా రూ.2వేలు, 500 నోట్లలో నానో చిప్ పెట్టారని విన్నాం. ఈమేరకు డిస్ ప్లే చేస్తూ యూట్యూబ్ లలో వీడియోలు కూడా రావడం, అవి వైరల్ అవ్వడం తెల్సిందే. అయితే అవేవీ నిజం కాదని అధికారులు తేల్చేసారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి నానో చిప్/పార్టికిల్(కణాలు) పెట్టాలనుకున్న మాట వాస్తవమేనట.

ఈమేరకు ఆర్బీఐ ప్రకటించింది. కానీ, అది అధిక వ్యయంతో కూడుకున్న ప్రక్రియ కావడంతో ఆ ప్రతిపాదన విరమించామని ఆర్బీఐ అధికారి ఒకరు బెంగళూరులో తెలియజేశారు.అంతే కాక అలాంటి నోట్ల కోసం ప్రత్యేక స్కానింగ్ యంత్రాలు కూడా అవసరమని, అది మరింత భారం కావడంతో పూర్తిగా వెనక్కు తగ్గామని చెప్పుకొచ్చారు.

English summary

Do you know why didn't put nano chips in new currency