వెంకన్నను వడ్డీ కాసులవాడని ఎందుకంటారో తెలుసా?

Do you know why we call lord Venkateswara swamy as Vaddi Kasula Vadu

12:23 PM ON 6th December, 2016 By Mirchi Vilas

Do you know why we call lord Venkateswara swamy as Vaddi Kasula Vadu

శ్రీవారు అనగానే అందరికీ గుర్తొచ్చేది అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం. మొదటి స్థానంలో వాటికన్ సిటీ ఉంది. అయితే తిరుమలకు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టత గూర్చి అందరికీ తెలుసు. అక్కడ ఏడుకొండల్లో కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతామన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడైతే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం రోజుకు కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది.

అయితే వేంకటేశ్వరస్వామికి అంతటి ఆదాయం వస్తుండడాన్ని పక్కన పెడితే ఆపదమొక్కుల వాడని, వడ్డీ కాసుల వాడని భక్తజనం పిలుచుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి, ఆపదల నుంచి గట్టెక్కించి, అంతా శుభమే కలిగించే వాడు కావడం వల్ల ఆయనకు ఆపద మొక్కుల వాడని పేరు వచ్చింది. అయితే వడ్డీ కాసుల వాడనే పేరు రావడం వెనుక గల కారణం ఏమిటో అందరికీ తెలీకపోవచ్చు...

1/4 Pages

ఒకానొక సమయంలో వేంకటేశ్వరస్వామి పద్మావతీ దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీ దేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు.

English summary

Do you know why we call lord Venkateswara swamy as Vaddi Kasula Vadu