పాత నోట్లతో ఎన్ని కోట్ల బంగారం కొన్నారో తెలుసా?

Do you people know how much gold got purchased with old notes?

11:02 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Do you people know how much gold got purchased with old notes?

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నవంబర్ 8న రూ 500, రూ 1000నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఒక్క నవంబర్ నెలలో అందునా హైదరాబాద్ లో పాతనోట్లతో కొన్న బంగారం చూస్తే షాకవుతాం. నవంబర్ 8 నుంచి 30 వరకు అక్షరాలా రూ.2,700 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్ల కొనుగోళ్లు జరిగాయట. ఈ విషయం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది. ఇక కొనుగోలు చేసిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

నవంబర్ 8 నుంచి 30 మధ్యకాలంలో 8 వేల కేజీల బంగారం హైదరాబాద్ కు దిగుమతి అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 1 నుంచి 10 వరకూ తాజాగా మరో 1,500 కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో అంతకు ముందు దిగుమతి చేసుకున్న బంగారమంతా అమ్ముడుపోయినట్లు తెలుస్తోందని ఈడీ తెలిపింది. నగల వ్యాపారుల వద్ద నుంచి ఈ బంగారాన్ని రద్దైన నోట్లతోనే పలువురు కొనుగోళ్లు చేపట్టినట్లు సమాచారం. నవంబర్ 8 అనంతరం పాత నోట్లు స్వీకరించి వర్తకులు బంగారాన్ని అమ్మారా? అనే విషయంపై ఈడీ, ఐటీ అధికారులు కూలంకషంగా ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చూడండి: బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి: ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతల పై హెయిర్ రీగ్రోత్ మొదలవుతుంది

English summary

We all know that old 500 and1000 rupees notes got banned. After this, Only in the month of November 2,700 Crores valuable gold was purchased in Hyderabad and totally 800 kilograms gold was imported to the Hyderabad.