వావ్ ... కరెన్సీ నోట్లను ధరించి .. ఏం చేస్తున్నాడో తెలుసా

Doctor Adali Delamini Designed his Clothes with Currency

11:40 AM ON 17th December, 2016 By Mirchi Vilas

Doctor Adali Delamini Designed his Clothes with Currency

అందంగా, వెరైటీగా కనిపించడానికి పాపులారిటీ సాధించడానికి దేశవిదేశాలకు చెందిన డిజైనర్లతో ప్రత్యేకంగా దస్తులు రూపొందించుకుని వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది సహజమే అయినా, ఓ వ్యక్తి గత కొనేళ్లుగా కరెన్సీ నోట్లనే దుస్తులుగా మార్చుకుని, దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. అయితే, ఇటీవల జరిగిన ఓ పరిణామంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే,

దక్షిణాఫ్రికా డర్బన్ కి చెందిన 'ఆండలి డిలామిని'అనే ఓ మూలికా వైద్యుడుకి మంచి పేరుంది. ఎందుకంటే, అతని వైద్యంతో ఎంతటి రోగమైనా తగ్గిపోతుందని స్థానికులకు బాగా నమ్మకం. ప్రతి రోజు వందల సంఖ్యలో రోగులు అతని వద్దకు వస్తారు. దీంతో డిలామినికి మంచి పేరు రావడమే కాదు.. ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఎంతగా అంటే రోజుకూ లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. అయితే డిలామినికి ఎందుకు ఆలోచన వచ్చిందో కానీ.. తన వద్ద ఉన్న నోట్లను తాను ధరించిన దుస్తులకు అంటించుకోవడం మొదలుపెట్టాడు. ఇలా దుస్తులు ధరించడం తనకు ఎంతగా నచ్చిందో ఏమోగాని... అప్పటి నుంచి డిలామిని అలాంటి దుస్తులు ధరిస్తూ వచ్చాడు.
తన ఒంటిపై ఉన్న ఎవరూ లాక్కోకుండా బాడీగార్డులను కూడా నియమించుకున్నాడు. దీంతో డిలామిని చూసి ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. వైద్యుడిగానే కాకుండా నోట్ల దుస్తులు ధరిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. దీంతో సోషల్ మీడియాలో స్టార్ గా నిలిచాడు.

ఇటీవల ఓ ప్రముఖ కళాకారుడి అంతిమ సంస్కారాల కార్యక్రమానికి డాలామిని నోట్ల దుస్తులను ధరించే వెళ్లాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో పలువురు ఇలాంటి కార్యక్రమానికి అలాంటి దుస్తులు వేసుకు ని వెళ్ళాలా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

English summary

A Doctor in South Africa got an new idea he himself designed his clothes with currency. But how people can go crazy like this