మత్తు ఇచ్చారు... ఆపరేషన్ మరిచారు...

Doctor forgot to do operation in Uttar Pradesh

02:59 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Doctor forgot to do operation in Uttar Pradesh

ఆపరేషన్ చేసి, కడుపులో కత్తిరి మర్చిపోయారని... ఇలా రకరకాల వార్తలు వినడం, చూడ్డం మామూలే. కానీ ఇదో వింత ఘటన. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మహిళలకు ఆపరేషన్ చేయడం కోసం మత్తుమందు ఇచ్చి తన పని పూర్తి చేయకుండానే వెళ్లిపోయాడు ఓ ప్రభుత్వ వైద్యుడు. ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్ ప్రాంతంలోని జాన్ పూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనితో ఆ మహిళల బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. మహిళలను ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లేలా డాక్టర్ ప్రవర్తించాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆందోళనకు దిగడంతో అక్కడి సిబ్బంది స్పందించి తమపై అధికారులకు విషయం తెలియజేసారు. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే..

ఆసుపత్రిలో 17 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. ఆపరేషన్ చేసే ఉద్ధేశంతో మొదట ప్రవీణ్ కుమార్ ఆ మహిళలకు మత్తు మందు ఇవ్వాలని అక్కడి సిబ్బందికి చెప్పాడు. మత్తుమందు ఇచ్చిన తరువాత శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన సామగ్రి లేదంటూ సదరు డాక్టర్ ఆసుపత్రి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళల బంధువులు ఆందోళన చేపట్టారు. అక్కడి ఆశా వర్కర్లు డీఎం - జాన్ పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు సమాచారం అందజేశారు. ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఒ కూడా అక్కడికి రావాల్సి వచ్చింది.

మహిళలకు మత్తుమందు ఇచ్చి వెళ్లిపోయిన నాలుగు గంటల తరువాత ప్రవీణ్ కుమార్ అక్కడకు మళ్లీ వచ్చాడు. అయితే అప్పటికే మత్తుమందు తీసుకున్న 17 మంది మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన మరి 13 మంది మహిళలకు ప్రవీణ్ కుమార్ ర్రాతి 11 గంటల వరకు శస్త్రచికిత్స జరిపాడు. డాక్టర్ నిర్వాకంపై స్పందించిన డీఎం ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఇంకా నయం ఎవరి ప్రాణాలకు ముప్పు రాలేదు. అయినా ఇదెక్కడి చోద్యం అండీ బాబు అంటూ పలువురు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: వినాయక చవితికి 21 పత్రాలతో పూజ.. నిమజ్జనం వెనుక అసలు కధ తెలుసా?

ఇది కూడా చదవండి: ఆ పెట్రోల్ బంక్ కి బికినీలో వెళ్తే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఫ్రీ!

ఇది కూడా చదవండి: 'జనతా' పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

English summary

Doctor forgot to do operation in Uttar Pradesh