ఆ హాస్పిటల్ లో ఆడపిల్ల పుట్టిందంటే బిల్ ఫ్రీ.. ఎందుకో తెలుసా?

Doctor Ganesh Rakh in pune not taking bill while child girl was born

04:34 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Doctor Ganesh Rakh in pune not taking bill while child girl was born

గర్భంతో ఉన్న మహిళ మగ పిల్లవాడిని ప్రసవిస్తే పండగ చేసుకుని, అదే ఆడపిల్ల పుడితే పురిట్లోనే చంపేయాలని ఎంతో మంది చూసే రోజులివి. ఇది అనాది నుంచి మన దేశంలో జరుగుతున్న సాంఘిక దురాచారం. ఈ క్రమంలో ఒకప్పుడు 1961లో ప్రతి వేయి మంది అబ్బాయిలకి 976 అమ్మాయిల సంఖ్య ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అది 914కు పడిపోయింది. దీన్ని బట్టి చూస్తే చాలు ఆడపిల్లంటే ఎక్కువ మంది ఎందుకు వద్దనుకుంటున్నారో. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ వంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడాన్ని నిషేధించింది.

అయినా ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్లు మాత్రం డబ్బుకి కక్కుర్తి పడుతుండడంతో ఆ పరీక్షలు ఆగడం లేదు, ఆడ శిశువుల మరణాలు కూడా తగ్గడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో విపరీత ధోరణి ప్రదర్శిస్తున్న వారిని చూసిన ఓ డాక్టర్ ఇకపై పుట్టే ఆడ పిల్లలను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకోగానే తన నిర్ణయాన్ని అమలులో పెట్టాడు. ఇప్పుడదే నిర్ణయం ఎంతో మంది వైద్యులను, ఆ మాట కొస్తే ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధులను ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ డాక్టర్ విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమం ఏంటో తెలుసా? అదే 'ముల్గీ వచ్వా అభియాన్'(Mulgi Vachva Abhiyan). అంటే 'ఆడ శిశువులను సంరక్షించే క్యాంపెయిన్'(campaign to save the girl child) అని అర్థం.

మహారాష్ట్రలోని పూణెలో డాక్టర్ గణేష్ రాఖ్ అనే ఓ వైద్యుడు సొంతంగా హాస్పిటల్ నడుపుతున్నాడు. కాగా అతని హాస్పిటల్ లో సాధారణ అనారోగ్యాలకు చికిత్స కోసమే కాకుండా ప్రసవం కోసం గర్భిణీ మహిళలు కూడా వచ్చేవారు. అలాంటి మహిళలకు చెందిన కుటుంబ సభ్యులు, వారి బంధువులు తమకు కొడుకే జన్మించాలని ప్రార్థించేవారు. ఈ క్రమంలో కొందరికి కొడుకే పుట్టేవాడు. అలాంటి వారు హాస్పిటల్ లోనే వేడుకలు జరుపుకునే వారు. కూతురు జన్మించిన వారు మాత్రం ప్రసవించిన మహిళను, ఆ శిశువును చూడకుండానే వెళ్లిపోయేవారు. అలాంటి వారందరినీ డాక్టర్ గణేష్ రాఖ్ దగ్గరగా పరిశీలించాడు.

దీంతోపాటు ప్రతి ఏటా అబ్బాయి, అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతుండడాన్ని కూడా అతను గమనించాడు. దీంతో ఎలాగైనా ఆడ శిశువును రక్షించాలని, వారు కూడా మగ శిశువులతో సమానమేనని నిరూపించాలని అనుకున్నాడు. అలా అనుకుని ఎవరూ తీసుకోని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే తన హాస్పిటల్ కు ప్రసవం కోసం వచ్చే మహిళలకు ఒక వేళ ఆడశిశువు పుడితే ఆ కుటుంబం నుంచి ఎలాంటి ఫీజు, బిల్స్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో అక్కడ ప్రజలు గణేష్ రాఖ్ ని దేవుడుగా కొలుస్తున్నారు.

English summary

Doctor Ganesh Rakh in pune not taking bill while child girl was born