భర్తకు మత్తిచ్చి భార్య పై అత్యాచారం చేసిన డాక్టర్

Doctor rapes patient wife

05:22 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Doctor rapes patient wife

రాను రాను లోకంలో కామంధులు పెరిగిపోతున్నారు. వావి వరసలు లేకుండా సొంత వాళ్ళ పై కూడా లైంగిక దాడికి దిగుతున్నారు. ఆ లైంగిక దాడిలో వరసలు కూడా చూడటంలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకో అర్ధమయ్యే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రండి. వరంగల్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక భార్య తన భర్తకు ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే వచ్చిన పేషెంట్ కు వైద్యం చేయాల్సిన హాస్పిటల్ లోని డాక్టర్ కు ఒక నీచమైన ఆలోచన తట్టింది. అనారోగ్యంతో ఉన్న ఆ మహిళ భర్తను గది లోకి తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పధకం ప్రకారం పడుకోబెట్టేశాడు. ఆ పై ఆ మహిళకు కూడా మాయ మాటలు చెప్పి మత్తు టాబ్లెట్ ఇచ్చాడు.

ఆ టాబ్లెట్ వేసుకోగానే ఆమె గాఢనిద్రలోకి జారిపోయింది. ఆ తరువాత ఆ కామ డాక్టర్ ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పై మత్తు దిగి తెలివి వచ్చిన తర్వాత తన పై అత్యాచారం జరిగిందని గుర్తించిన ఆ మహిళా డాక్టర్ కామా వాంఛ గురించి కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె కుటుంబ సభ్యులు ఆ డాక్టర్ ను కుక్కను కొట్టినట్లు కొట్టి పోలీసులకు అప్పగించారు. బాధిత బంధువులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలం మండలం కాకరవాయి శివారు ఎనెకుంట తండాకు చెందినవారు. నీచానికి పాల్పడ్డ ఆ డాక్టర్ మరిపెడలో మోహన్‌ అనే పీఎంపీ డాక్టర్.

English summary

Doctor rapes patient wife. Warangal doctor rapes a patient wife by giving sleeping tablet.