తోటి  వైద్యునిపై కాల్పులు జరిపి , ఆత్మహత్య చేసుకున్న వైనం    

Doctor Shoots Another Doctor In Hyderabad

10:00 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Doctor Shoots Another Doctor In Hyderabad

ముగ్గురు వైద్యుల మధ్య ఘర్షణ కాల్పుల వరకూ వెళ్లింది. చివరకు కాల్పులకు తెగబడ్డ ఓ వైద్యుడు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ లో సంచలనం కల్గించింది. హిమాయత్‌నగర్‌లో సోమవారం సాయంత్రం ఓ కారులో కాల్పుల శబ్దం మొదలుకుని వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి, డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాలీలా వున్నాయి...చైతన్యపురికి చెందిన సాయినికిత్‌ ఆసుపత్రి యజమాని, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ శశికుమార్‌, మాదాపూర్‌కు చెందిన డాక్టర్‌ రాచకొండ ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ సాయికుమార్‌లు మూడేళ్ల క్రితం మాదాపూర్‌లో రూ.15కోట్ల పెట్టుబడితో లారెల్‌ ఆసుపత్రిని ప్రారంభించాలనుకున్నారు. డాక్టర్‌ శశికుమార్‌ రూ.75 లక్షలు, ఉదయ్‌ రూ.3. కోట్లు, సాయి 2.9కోట్ల పెట్టుబడులు పెట్టారు. నిర్మాణం ఆలస్యమవడంతో ఎన్నారైల నుంచి అప్పు తీసుకుని, గత జనవరి 1న ఆసుపత్రిని ప్రారంభించారు. అయితే శశికుమార్‌కు చెప్పకుండా మరొకరికి కూడా డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, భాగస్వామ్యం కల్పించడంతో. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన వాటా తీసుకోవాలని శశికుమార్‌ డిమాండ్‌ చేయడంతో ఉదయ్‌, సాయికుమార్‌లు అంగీకరించి సోమవారం మాట్లాడుకుందామనుకున్నారు. ముగ్గురూ హిమాయాత్‌నగర్‌ చేరుకున్నారు.

అక్కడ కొంతసేపు చర్చించుకున్నారు. జనం ఉండటంతో వారంతా ఒకే కారులో బయలుదేరి అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌ ముందు ఆగారు. డ్రైవింగ్‌ సీటులో ఉదయ్‌ ఉండగా... పక్కనే సాయికుమార్‌, వెనుక శశికుమార్‌ కూర్చున్నారు. సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో శశి తన లైసెన్సు రివాల్వర్‌ పాయింట్‌ .32 ఎంఎంతో ఉదయ్‌పై ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. తప్పించుకునే క్రమంలో ఎడమ చెవి వైపు గాయమైంది. సాయికుమార్‌, శశికుమార్‌లు పారిపోయారు. గాయంతోనే డాక్టర్‌ ఉదయ్‌ ఆటోలో వెళ్లి హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి నిర్వహణ, లావాదేవీల్లో బేధాభిప్రాయాల కారణంగా ఈ ఘటన జరిగిందని, శశికుమార్‌ను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించామని డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. చైతన్యపురికి చెందిన శశికుమార్‌కు స్థానికంగా సాయినికిత్‌ ఆసుపత్రి ఉందని, ప్రస్తుతం సిగ్మా ఆసుపత్రిని కూడా లీజుకు తీసుకున్నారన్నారు. శశికిరణ్‌పై హత్యాయత్నం కేసుతోపాటు, ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసారు. అయితే ఈలోగానే .శశికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో అతని మృతదేహాన్ని గుర్తించారు. శశికుమార్‌ రివాల్వర్‌తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మోసం చేసిన విషయాన్ని తట్టుకోలేక, కాల్పులు జరిపి చివరకు తానే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

English summary