తమిళనాట రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డాక్టర్ స్వామి

Doctor Subramanya Swamy asked to rule the Tamil Nadu stare by president

10:18 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Doctor Subramanya Swamy asked to rule the Tamil Nadu stare by president

ఎప్పుడూ కూడా సంచలన వ్యాఖ్యలతో, కోర్టు కేసులతో హడలు గొట్టే డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి నోరు విప్పారు. బీజేపీ సీనియర్ ఎంపీ అయిన డాక్టర్ సుబ్రమణ్య స్వామి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. జయలలిత అనారోగ్యంతో బాధపడుతున్న దృష్ట్యా, ఇది అవసరమని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కు ఆయన లేఖ రాశారు. సీఎం జయలలిత రెండు వారాలుగా ఆస్పత్రిలోనే ఉండటం వల్ల, ఆమె ఎప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంటారో తెలియని నేపథ్యంలో పాలనా వ్యవస్థ గాడి తప్పందని, శాంతిభద్రతలు కుంటుపడ్డాయని ఆ లేఖలో స్వామి పేర్కొన్నారు.

తమిళనాడు పరిపాలనా బాధ్యతలను మాజీ ప్రధాన కార్యదర్శి చేతిలో పెట్టినట్లు తెలుస్తోందని ఆయన లేఖలో సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల మధ్య తమిళనాడులో ఐఎస్ ఉగ్రవాదులు, ఎల్టీటీఈ ఉగ్రవాదులు, నక్సలైట్లు చురుగ్గా పావులు కదిపే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించాలని స్వామి కోరారు.

1/2 Pages

జయ ఆసుపత్రికి వచ్చిన రాహుల్..


రెండువారాలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సీఎం జయలలితను రాహుల్ గాంధీ పరామర్శించారు. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు చెన్నై అపోలోకి రాహుల్ వచ్చారు. డాక్టర్లను అడిగి జయ ఆరోగ్యం గురించి రాహుల్ తెలుసుకున్నాడు. పావుగంట పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. జయలలిత వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకపోతుండటంతో రాహుల్ ఆమెను చూశారా, లేదా డాక్టర్లతో మాట్లాడి వచ్చేశారా అన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఊపిరిత్తులు, మధుమేహం, ఆస్తమా ఇన్ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే! అపోలో వైద్యులతోపాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక టీం, లండన్ డాక్టర్ రిచర్డ్ బాలేలు జయలలితకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాగా మెరుగైన వైద్యం కోసం జయలలితను సింగపూర్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

Doctor Subramanya Swamy asked to rule the Tamil Nadu stare by president