డాక్టర్ ఉద్యోగానికి ముప్పు తెచ్చిన సేల్ఫీ

Doctor taking selfie during delivery

05:38 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Doctor taking selfie during delivery

ఇటీవల ఎక్కడ చూసినా స్మార్ట్‌ ఫోన్లే. ఎక్కడపడితే అక్కడ ఎలా పడితే అలా సెల్ఫీలు దిగి జనాలను పిచ్చెక్కిస్తున్నారు. సెల్ఫీల పిచ్చి రోజు రోజుకీ బాగా ముదిరిపోతుంది. సెల్ఫీలు దిగడం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది. మాములుగా సెల్ఫీలు దిగితే పర్వాలేదు. వృత్తికి కళంకం తెచ్చే విధంగా కొంతమంది ప్రవరిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఓ డాక్టర్‌ తీసుకున్న సెల్ఫీ అతడి వృత్తికే కళంకం తెచ్చిపెట్టింది. మోల్డొవాలోని ఓ డాక్టర్‌ ఓ గర్భిణికి పురుడు పోస్తున్నాడు. ఆ సమయంలో సెల్ఫీలు తీసుకున్నాడు. అంతటితో ఆగాడా.... లేదు ఆఫోటోలని ఫేస్‌బుక్‌ లో పోస్ట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఇతడి సెల్ఫీలు చూసి అక్కడి హెల్త్‌ మినిస్టర్‌ రుక్సాండా గ్లావన్‌కి విపరీతమైన కోపం వచ్చి ఆడాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడాక్టర్‌ ఇంకా ఆసుపత్రిపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary

A professional doctor taking a selfie, while appearing to be delivering a baby and then posting the image to social media.