వామ్మో ... యువతి కడుపులో 150 పాములు

Doctors Remove 150 Worms From Womans Stomach

11:22 AM ON 17th January, 2017 By Mirchi Vilas

Doctors Remove 150 Worms From Womans Stomach

ఒకటా రెండా ఏకదంగా ఆ యువతి కడుపులో 150పాములున్నాయట. అవును నిజం. ఆ యువతి కడుపునొప్పితో బాధపడుతున్న కారణంగా శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులోంచి 150 వానపాములను వైద్యులు వెలికితీశారు. ఆశ్చర్యం గొలిపే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి కి చెందిన నేహా బేగం(22) తరచూ కడుపునొప్పి, వాంతులతో బాధపడేది. ఏళ్ల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా.. ఎంతోమంది వైద్యులను సంప్రదించినా ఫలితం కానరాలేదు.

చివరికి కేజీ నందా ఆసుపత్రి వైద్యులు ఆమె పేగుల్లో ఏదో ఆడ్డుపడుతున్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స సమయంలో ఆమె పేగుల్లోంచి వానపాములు బయటికి రావడం చూసి వైద్యులు నివ్వెరపోయారు. దాదాపు 4 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి నేహా బేగం పేగుల్లోంచి 10 అంగుళాల పొడవైన దాదాపు 150 బతికున్న వానపాములు బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయమై కేజీ నందా ఆసుపత్రిలోని మేల్ గైనకాలజిస్టు డాక్టర్ ఆనద్ ప్రకాష్ తివారీ మాట్లాడుతూ.. ఇలాంటి కడుపునొప్పి కేసుల్లో సాధారణంగా 3 / 4 వాన పాములు బయట పడుతుంటాయని, కానీ ఇంత పెద్ద సంఖ్యలో వానపాములు బయట పడడం మాత్రం ఇదే తొలిసారని, తామే దిగ్బ్రాంతికి గురయ్యామని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చూడండి: ఇవి సడెన్ గా ఆపేస్తే… లావై పోతారట నిజమా?

ఇది కూడా చూడండి: పిల్లలకు జలుబు తగ్గాలన్నా, కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలన్నా ఇవి తింటే మంచిది..

English summary

Doctors Remove 150 Worms From Woman's Stomach