ఇంతకీ జనసేనాని వస్తున్నాడా? లేదా ?

Does Jannasana is really coming?

12:50 PM ON 26th January, 2017 By Mirchi Vilas

Does Jannasana is really coming?

సాగర తీరం విశాఖలో ప్రత్యేక హోదా డిమాండ్ తో యువత తలపెట్టిన మౌన ప్రదర్శనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రతిపక్షాల నేతలు ప్రకటించడం, అందులో స్వయంగా పాల్గొంటానని వైసీపీ అధినేత జగన స్పష్టం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో గురువారంనాడు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్తచర్యగా పోలీసు బలగాలన్నీ బుధవారం మధ్యాహ్నం నుంచి రోడ్లపైనే బందోబస్తు చేపట్టాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ బీచలో కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసు ఉన్నతాధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. కాగా.. జనసేన కార్యకర్తలు మంగళవారం విశాఖలోని వివిధ కాలేజీలకు వెళ్లి మౌన ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. బుధవారంనాడు.. ఆంధ్ర యువత జిల్లా కోర్టుకు వెళ్లి న్యాయవాదులను కలిసి మౌన ప్రదర్శనకు మద్దతు కోరారు. వీరికి సీపీఎం, సీపీఐ, పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ప్రత్యేక హోదా కోసం వైసీపీ కార్యకర్తలు ఆర్ కే బీచ్ లో గురువారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తారని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పార్టీ అధినేత జగన సాయంత్రం 4 గంటలకు విశాఖ వస్తారని పేర్కొన్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి యువకులు, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు దీనికి అనుమతించకపోయినా సరే చేస్తామని, అవసరమైతే అరెస్టులకు కూడా సిద్ధమని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ ప్రకటించారు. కనీసం పది వేల మంది కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని వివరించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ , ప్రతిపక్ష నేత జగన్ విశాఖపట్నం వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నుంచి విశాఖ వైపు వచ్చే దారులపై బుధవారం రాత్రి నుంచి ఆయా జిల్లాల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవ్వచ్చు? వారిని విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా ఆపితే ఎలా ఉంటుంది? అక్కడేదైనా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వెంటనే శంషాబాద్ కు తీసుకెళ్లి దించితే ఎలా ఉంటుంది? అన్న కోణాల్లో పోలీసు ఉన్నతాధికారులు యోచన చేస్తున్నట్టు టాక్ నడుతోంది. మొత్తానికి తమిళనాట జల్లి కట్టు దెబ్బ ఆంధ్రాలో ఒక్కసారిగా ప్రేత్యేక హోదా అంశం తెరమీదికి రావడం విశేషం. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.

ఇది కూడా చూడండి : ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఇలాంటి ఫోనే లేదట

ఇది కూడా చూడండి : పర్మిషన్ ఇవ్వాల్సిందే

English summary

For the Pratyaka Hoda of State Andhra Pradesh, Some people wants to Keep meeting in the R.K beach Vizag. For this opposition leaders Jagan and Pawan Kalyan were supporting them but state government is opposing it.