వామ్మో... ఈ నోట్ల యవ్వారం చిప్ దెబ్బేనా?

Does New 2000 And 500 Rupee Having Chip In It

10:56 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Does New 2000 And 500 Rupee Having Chip In It

రూ 500, రూ 1000 నోట్లు రద్దు అయ్యాక కొత్తగా రెండువేల నోటు వస్తుందని తెల్సి , దీనికి చిప్ అమర్చారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే అదేం లేదని రిజర్వ్ బ్యాంకు కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్న దాడులు, పట్టుబడుతున్న వైనం చూస్తుంటే, ఇది డిఫ్నెట్ గా చిప్ దెబ్బే అనిపిస్తోంది. రెండువేల నోట్లు ఎక్కడైతే పెద్దమొత్తంలో ఉన్నాయో వాటి గుట్టు రట్టుచేసేది నోట్లలోని చిప్పే అన్నది మళ్లీ హాట్ టాపిక్ గా మారిపోయింది. కోటానుకోట్ల కొత్తనోట్లు కలువలోని ఎలుకల్లా బయటకు వస్తున్నందుకు ఇదే కారణమంటున్నారు. ఒకపక్క కొత్త రూ.2000, రూ.500 నోట్లలో జీపీఎస్ చిప్ వంటి సంకేతాన్ని ఉంచాలని భావించినమాట వాస్తవేమని అయితే, ఇది ఎంతో ఖర్చుతోకూడిన వ్యవహారమని తేలడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులే చెప్పారు.

అయితే, జీపీఎస్..నానో చిప్ సీక్రెట్ బయటకి పొక్కడంతో కేవలం అక్రమార్కులు అలర్ట్ అవ్వకుండా ఉండేందుకే ఇలాంటి ఫీలర్ వదిలారన్నది ఇప్పుడు తాజాగా వినిపిస్తోన్నమాట. భారీగా ఉన్న కొత్తనోట్ల సమూహాన్ని గుర్తించడంలో ఈ చిప్ లే కీలకపాత్ర పోషిస్తున్నాయన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నవార్త. ఈ ప్రక్రియ ద్వారా నోట్ల ముద్రణ టైంతో కూడిన వ్యవహారం కావడం వల్లే కొత్తనోట్ల ముద్రణలోకూడా ఎక్కువ జాప్యం జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: లీటర్ నీటిలో .. ఈ పౌడర్ కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలు

ఇవి కూడా చదవండి: రెండు రకాల కొత్త వెయ్యి నోట్లు!

English summary

A News Came when new 2000 rupee currency note was launched that there was a nano chip inside the currency note. But RBI was opposed that news. Now so many black money holders were caught after the new currency notes launched.