జియో స్పీడ్ పెరిగిందా లేదా?

Does the speed of Jio inceased?

11:14 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Does the speed of Jio inceased?

బంపర్ ఆఫర్ లతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరింతగా దూసుకుపోతోంది. గతంతో పోలిస్తే జియో 4జీ నెట్ వర్క్ డౌన్ లోడింగ్ స్పీడ్ భారీగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్ ) వెల్లడించింది. డిసెంబర్ నెలలో ఈ నెట్ వర్క్ లో 18.16 ఎంబీపీఎస్ వేగం నమోదైనట్లు ట్రాయ్ వెల్లడించింది. అదే సమయంలో మిగిలిన నెట్ వర్క్ లైన ఐడియా 5.03, ఎయిర్ టెల్ 4.68, బీఎస్ ఎన్ ఎల్ 3.42, ఎయిర్ సెల్ 3, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2.6 ఎంబీపీఎస్ ల వేగాన్ని నమోదు చేసినట్లు ట్రాయ్ పేర్కొంది. అంతకుముందు నవంబర్ లో జియో వేగం కేవలం 5.8 ఎంబీపీఎస్ మాత్రమే. వొడాఫోన్ వేగం కూడా నవంబర్ లో 4.9 ఎంబీపీఎస్ కాగా డిసెంబర్ లో ఆ వేగం 6.7 ఎంబీపీఎస్ కు పెరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే డౌన్ లోడింగ్ స్పీడ్ ఆధారంగా సరాసరి గణాంకాలను ప్రతి నెలా ట్రాయ్ విడుదల చేస్తుంటుంది. మైస్పీడ్ అప్లికేషన్ ద్వారా ఈ వేగాన్ని కొలుస్తుందని అంటున్నారు. ఇంతకీ జియో స్పీడు పెరిగిందని అంటున్నారే తప్ప నిజంగా హెచ్చిందా లేదా అన్నది వినియోగదారులు చెప్పాలి.

ఇది కూడా చూడండి : ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి : కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

ఇది కూడా చూడండి : బైక్ ను ఉదయాన్నే సెల్ఫ్ తో కాకుండా కిక్ తో స్టార్ట్ చేయాలి, కారణం ఇదే

English summary

Cam pared to previous now the speed of Jio was very good compared to remaining the usage of jio was increasing day by day.