7గురిని రక్షించి మరీ మరణించిన కుక్క

Dog Dayko Dies After Saving 7 People From Ecuador Earthquake

11:06 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Dog Dayko Dies After Saving 7 People From Ecuador Earthquake

ఇది నిజంగా ఓ వింత ఘటనే ... భారీ భూకంప అనంతరం చేపట్టిన సహాయక చర్యల్లో శిథిలాల కింద చిక్కుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఏడుగురు వ్యక్తులను ఓ లాబ్రెడార్ జాతి శునకం కాపాడింది. ఉరకలు పరుకులు తీస్తూ, గల్లీ గల్లీ తిరుగుతూ అవిశ్రాంతంగా విధుల్లో పాల్గొంది. సహాయక బృందాలకు కూడా గుర్తించడానికి వీల్లేని ప్రాంతాల్లోనూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ...చివరకు అసలి సొలసి పోయింది. అంతేకాదు, విధి నిర్వహణలోనే చివరకు ప్రాణాలు విడిచింది.

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

ఈక్వెడార్ లో గతవారం 654 మందిని పొట్టనపెట్టుకున్న భారీ భూకంపం అనంతరం సహాయక చర్యల్లోకి దిగిన ఆ శునకరాజం పేరు డేకో. లాబ్రెడార్ జాతికి చెందిన డేకో వయస్సు నాలుగేళ్లు. ఆసక్తికరంగా మూడేళ్లుగా ఈక్వెడార్ లోని ఇబారా ఫైర్ సర్వీసెస్ లో తన సేవలందిస్తోంది. తాజా రెస్క్యూ ఆపరేషన్ లో ఉరుకలు పరుగులు మీద క్షణం తీరికలేకుండా పనిచేసిన డేకో ఏడుగురుని గుర్తించి...వారిని సిబ్బంది కాపాడేలా చేసేంది. ఓవైపు నిస్సత్తువు కోల్పోతున్నా లెక్కచేయలేదు. చివరికి ఎండవేడిమి, అతిసారం, శ్వాసకోస సమస్యలతో కుప్పుకూలింది. వైద్యులు డేకోను కోలుకునేలా చేయడానికి విశ్వప్రయత్నం చేసారు. అయితే, ఇక సెలవంటూ, తుదిశ్వాస విడిచింది. రెస్క్యూ సిబ్బంది బరువెక్కిన గుండెలతో తమ ప్రియతమ హీరో డేకోను ఖననం చేసి, కడసారి ఘనంగా నివాళులర్పించారు. డేకో సేవలకు గుర్తింపుగా ఇబారా ఫైర్ సర్వీస్ వారు తమ ఫేస్ బుక్ లో దాని ఫోటోను పోస్ట్ చేశారు. ఓ శునక రాజమా నీకు వందనం ... నీరాజనం ..

ఇవి కూడా చదవండి: కత్తిలాంటోడు ఫస్ట్ లుక్

ఇవి కూడా చదవండి: యువతి డ్రెస్ తీరుపై క్లాస్ పీకిన ఆటో వాలా(వీడియో)

English summary

A Dog named Dayko saved the lives of seven people by rescuing that 7 people from the Euador Earth Quake. This dog died due to sun stroke and respiration problem.