అక్కడ మేయర్ ఎవరంటే నిజంగా కుక్కే.. ఏకంగా మూడోసారి..

Dog is the mayor in America cormorant city

12:49 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Dog is the mayor in America cormorant city

ఇది నిజంగా, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఘటనే. వాస్తవానికి మేయర్ అంటే ఒక పట్టణానికి ప్రథమ పౌరుడు. అతని హోదా, అధికారాలు సదరు పట్టణంలో అత్యున్నతంగా ఉంటాయి. రాజకీయంగా ఎన్నికైనా నగరాభివృద్ధిని గాడిలో పెట్టడంలో అతని పాత్ర కీలకం. మనదేశంలో అయితే మేయర్ ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి ఉంటాయి. విదేశాల్లో అయితే వారి రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తానికి ఏ దేశంలో అయినా మేయర్ గా ఎన్నికవ్వడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలన్నీ మనుషులకే కదా. మరి వాటిని పక్కన పెట్టి ఓ శునకానికి మేయర్ పదవిని ఆ నగర ప్రజలు కట్టబెట్టారు. అది కూడా వరుసగా మూడోసారట. అందుకే, నిజంగా ఇది వింతే.

1/3 Pages

అవును మరి మేయర్ గా ఓ కుక్కపిల్ల ఎన్నికైందంటే ఎవరికైనా ఆశ్చర్యమే కదా. వివరాల్లోకి వెళ్తే.. డ్యూక్ అనే 9 సంవత్సరాల శునకం వరుసగా మూడోసారి మేయర్ గా ఎన్నికై అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రత్యర్థులుగా ఇద్దరు వ్యక్తుల బరిలో ఉన్నా వారిని చిత్తు చేసి మేయర్ గా అధికారాన్ని కైవసం చేసుకొంది. ఇంతకీ అమెరికాలోని కార్మొరాంట్ అనే పట్టణంలో ఈ విడ్డూరం చోటు చేసుకుంది. ఆ గ్రామ జనాభా 1013 మంది. గత కొన్నేళ్ల నుంచి డ్యూక్ మేయర్ గా పోటీ చేస్తూనే ఉంది. పోటీ చేసిన రెండుమార్లు గెలిచేసింది. తాజాగా మూడోసారి(2016) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

English summary

Dog is the mayor in America cormorant city