కుక్క గారి సెల్ఫీ మోజు

Dog smile on command

03:25 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Dog smile on command

ఫోటోలు దిగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ తెగ ఫోజ్ లు ఇచ్చేస్తారు. తర్వాత ఏముంది ఫోటోలను చూసుకొని మురిసిపోతారు. ఈ మద్య వాడుకలో బాగా వినిపించే పదం సెల్పీ. వేరే వాళ్ళని ఫోటో తీయమని అడగకుండా ఎవరికి వారే వారికి నచ్చినట్లు తీసుకోవచ్చు. సరే కానీ మనుషులం కాబట్టి మనకి నచ్చిన ఎక్స్‌ప్రెషన్ పెట్టి తీసుకుంటున్నాం. మరి జంతువులకో....! ఎప్పుడైనా ఆలోచించారా.... వాటిని ఫోటోలు తీసేటప్పుడు స్మైల్ ప్లీస్ అన్నారా ఎప్పుడైనా...?

నవ్వమని అడిగితే మాత్రం అవి నవ్వుతాయా ఏంటి అని అనుకుంటే మీ పొరపాటే. కచ్చితం గా నవ్వుతాయ్ అంటున్నారు . ఇటీవల ఒక కుక్క ఫోటోలకి తెగ ఫోజ్ లు ఇచ్చేస్తుంది. అలా ఇలా కాదండోయ్ విత్ స్మైల్ తో .... ఆ డాగీ కి స్మైల్ కమాండ్ని నేర్పించారు. దాంతో ఆది స్మైల్ ప్లీస్ అనగానే తెగ నవ్వేస్తుంది. ఈ వీడియో లోని కుక్కని చూస్తే మీకే తెలుస్తుంది, కచ్చితంగా దీన్ని చూసి మీరు కూడా ఒక స్మైల్ ఇస్తారు. ఆ డాగీ స్మైల్ చూసి ఎవరైన పడిపోవాల్సిందే అంత క్యూట్ గా నవ్వుతుంది. వీడియో తేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ డాగీ కి ఫ్యాన్ ఫొలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఈ డాగీ ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది.

English summary

Dog smile on command. Dog smile cutely due to give a command. It is amazing response to video visitors.