రిపబ్లిక్ డేలో  'గ్రామ సింహాల' విన్యాసం

Dogs Show In Delhi Republic Day Parade

12:49 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Dogs Show In Delhi Republic Day Parade

గతంలో గ్రామాలకు రక్షణ గా శునకాలు (కుక్కలు) ఉండేవి. అందుకే వీటిని గ్రామ సింహాలు అనేవారు. ఇప్పుడంటే పిచ్చికుక్కలు ఇబ్బంది కల్గిస్తున్నాయనుకోండి. అయితే శునకాలకు వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే రక రకాల జాతుల కుక్కలను ఇళ్ళల్లో పెంచుతారు. డాగ్ షో లు నిర్వహిస్తుంటారు. ఇక పోలీసుల పరిశోధన లో డాగ్ స్వ్వాడ్ పాత్ర కీలకమే. ఇప్పుడు భారత గణతంత్ర వేడుకల్లో కూడా శునకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిల్లీలోని రాజ్‌పథ్‌లో 67వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా త్రివిధ దళాల కవాతు అట్టహాసంగా సాగింది. సైనిక కవాతులో శునక దళం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే మామూలు విషయం కాదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అలరించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హొలాండ్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. అందరి దృష్టిని శునకదళం ఆకర్షించడంతో 'గ్రామ సింహం' మరోసారి వార్తలకెక్కింది.

English summary

Dogs Squad special Dogs parade attracted all in Republic day parade which was held on Delhi. In this parade Indian Prime Minister Narendra Modi ,Pranab Mukherjee,And France president was attended as chief guest to this event