ట్రంప్ విజయాన్ని కోరుతూ ఇండియాలో హోమాలు 

Doing homam in India for Trump

04:49 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Doing homam in India for Trump

నిత్యం ఎవరినో ఒకరిని ఆడిపోసుకుంటూ, వార్తల్లో ఎక్కే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాదిరే , అమెరికా అధ్యక్షల ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూడా కనిపిస్తున్నాడు. ఇద్దరూ ఏదో ఒక వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. కాంట్రవర్సీ కామెంట్లతో ఎలా పాపులర్ అవ్వాలో వర్మ, ట్రంప్ కు బానే నేర్పినట్టు ఉన్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున రంగంలోకి ఏ ముహూర్తాన దిగాడో గాని అప్పటి నుంచి అందరిని టార్గెట్ చేస్తూ వివాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా ఇండియా పేరు చెపితేనే ట్రంప్ విరుచుకుపడిపోతున్నాడు.

సిలికాన్ వ్యాలీ మొత్తం ఇండియన్ సీఈవోలతో నిండిపోయి ఉందని చెప్పిన ట్రంప్ - తర్వాత ముస్లింలపై - బాలీవుడ్ పై ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ కాంట్రవర్సీ కామెంట్లకు లెక్కేలేదు. భారతీయులను పదే పదే ట్రంప్ టార్గెట్ చేస్తుంటే మనదేశంలో మాత్రం ట్రంప్ గెలుపుకోరుతూ ప్రార్థనలు - హోమాలు చేయడం విచిత్రంగా ఉంది. బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ట్రంప్ గెలవాలని కోరుతూ హిందూసేన కార్యకర్తలు హోమం నిర్వహించారు. 'వి లవ్ ట్రంప్' - 'వి సపోర్ట్ ట్రంప్' అని రాసివున్న ట్రంప్ ఫొటోలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొన్న పలువురు హిందూసేన కార్యకర్తలు మంత్రాలు చదువుతూ ట్రంప్ గెలవాలని భగవంతుడికి పూజలు చేశారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ట్రంప్ నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని వారు కోరుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్యారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాలోకి ముస్లింలను రానివ్వకుండా బ్యాన్ చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరి ఈ పూజలు ఫలించి, ట్రంప్ గెలిస్తుండా వేచి చూద్దాం..

English summary

Doing homam in India for Trump