చరిత్ర సృష్టించనున్న డాక్టర్లు.. ఒకరి తల మరొకరికి అతికించబోతున్నారు!

Doing shocking operation for changing head from one body to another body

03:16 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Doing shocking operation for changing head from one body to another body

అవును మీరు విన్నది నిజమే! బ్రెయిన్ డెడ్ అయి నిర్జీవంగా పడి ఉన్న దేహానికి, మరొకరి తల అతికించి ఓ ఆరోగ్యవంతమైన మనిషిని సృష్టించటానికి పూనుకుంది వైద్య రంగం. వైద్య చరిత్రను కొత్త అక్షరాలతో లిఖించబడే ఈ ప్రయోగం అసలు సాధ్యమా..! అవును సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు.. అంతే కాదు ఈ వినూత్న ప్రయోగానికి 2017లో శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఈ ప్రయోగానికి సిద్ధపడ్డ వ్యక్తి ఎవరో అన్నదేగా మీ అనుమానం. రష్యాకు చెందిన వాలెరీ స్పిరిడోనోవ్ అనే వ్యక్తి ఈ ఆపరేషన్ కు సిద్ధమయ్యాడు. వెర్డింగ్ నింగ్-హాఫ్ మన్ అనే అరుదైన నాడీ కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతున్న వాలెరీ జీవితం కుర్చీకే అంకితమైంది.

1/3 Pages

ఈ వ్యాధి సోకిన వారు యుక్త వయసు రాగానే మరణిస్తారు. దీంతో ఎంతో ప్రమాదకరమైన ఈ చికిత్సను తీసుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చానని చెప్తున్నారు. వాలెరీ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు నా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. చావు నా దగ్గరికి వచ్చే లోపే నేనే వేరే దేహానికి వెళ్లాలనుకుంటున్నాను. నా తలను వేరే దేహానికి అమర్చుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నానని తెలిపారు. తన తల నరుక్కుని వేరొక దేహానికి అతికించుకుని బ్రతకగలను అనే ఓ సంచలన వ్యాఖ్య చేసిన సెర్జియో కానావెరో సహకారంతో ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకెన్ స్టెయిన్ ఈ సర్జరీ నిర్వహించనున్నారు.

English summary

Doing shocking operation for changing head from one body to another body