బొమ్మలకు ఓ ఆసుపత్రి

Doll Hospital In Dubai

04:50 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Doll Hospital In Dubai

ఇదేంటి బొమ్మలకు ఆసుపత్రి అని ఆశ్చర్య పోవద్దు. ఎందుకంటే, చిన్న పిల్లలకు బొమ్మలంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారికి అదే లోకం. తాము ఆడుకుంటున్న బొమ్మలకు జ్వరం వచ్చిందని, జలుబు చేసిందని.. ఇలా పిల్లలు తరచూ కంప్లైంట్ చేస్తుండడం ప్రతీ ఇంట్లోనూ ఉండేదే. బొమ్మకు బాగాలేదనే బెంగతో పిల్లలు కూడా ఆందోళన చెందుతుంటారు. తిండితినడం మానేసి బెంగపెట్టుకుంటారు. దీంతో వారిని బుజ్జగించడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇక నుంచి అటువంటి బాధలు ఉండవు. ఎందుకంటే ‘జబ్బు’ పడిన బొమ్మను నేరుగా పిల్లలే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించవచ్చు. ఒకవేళ ఆ బొమ్మకు ఆపరేషన్ అవసరమైనా ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ లో అవసరమైన ‘ఆపరేషన్’ చేస్తారు. దీనిని చూసేందుకు చిన్నారులను కూడా అనుమతిస్తారు. ఆస్పత్రులన్నా, వైద్యులన్నా భయపడే చిన్నారులకు క్రమంగా దానిని దూరడం చేయడమే ఈ ఆస్పత్రి లక్ష్యం.

ఇంతకీ ఈ ‘టాయ్స్’ ఆస్పత్రి దుబాయ్ లో ఉంది. ఇక నుంచి చిన్నారులను తమ బొమ్మలకు చికిత్స కోసం నేరుగా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం చేయించుకోవచ్చని దుబాయ్ ‘నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ అథారిటీ(కేహెచ్ డీఏ) అంటోంది. బొమ్మలను ఇలా ఆస్పత్రికి తీసుకురావడం వల్ల వారిలో వైద్యులన్నా, ఆస్పత్రులన్నా సహజంగా ఉండే భయం క్రమంగా మాయమవుతుందని మొహమ్మద్ బిన్ రషీద్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ పేర్కొంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ పిల్లలు అనారోగ్యానికి గురైనా భయపడకుండా ఆస్పత్రికి వస్తారని పేర్కొంది. చిన్న పిల్లల సంతోషం కోసం ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధకు ఇదో మంచి ఉదాహరణగా కేహెచ్ డీఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ కరమ్ చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: ఓనమ్ వేడుకల్లోనూ ఫోర్న్ స్టార్స్

ఇది కూడా చూడండి: ఫేస్ బుక్ యూజర్లకు సరికొత్త ఫీచర్!

ఇది కూడా చూడండి: ఆ సీన్స్ పై రాధిక గరం గరం ...

English summary

Doll Hospital In Dubai. Knowledge and Human Development Authority said children Brought their own dolls directly to the hospital for treatment.