జైల్లో వున్నా సరే... వైఫ్ తో గ్యాంగ్ స్టర్ ఎంజాయ్

Don Abu Salem Enjoys With His Wife

12:09 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Don Abu Salem Enjoys With His Wife

అవునా అనొచ్చు, కానీ ఇదీ నిజంలా ఉందే. నిజానికి ఒకప్పుడు ఏదైనా కేసు మీద అరెస్టయి జైలుకెళ్తే ఖైదీలు నరకం చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఉన్నతస్థాయి వ్యక్తులు జైలుకెళ్తే చాలు సకల సౌకర్యాలు.. ఇంకా లోతుగా వెళ్తే రాజభోగాలు. కొన్నిసార్లు వాళ్లకు జైళ్లే ఫైవ్ స్టార్ హోటళ్లలా మారిపోతే, ఇక కొన్నిసార్లు పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అందుకు ఎగ్జాంఫుల్ గ్యాంగ్ స్టర్ అబూ సలేమ్ అని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే, తలోజా జైలులో అండర్ ట్రయల్ గ్యాంగ్ స్టర్ అబూ సలేం.. తరచూ విచారణల కోసం లక్నో, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వేస్టేషన్లలోని వెయిటింగ్ రూంల్లో తన భార్యతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ముంబై కేంద్రంగావున్న మిడ్ డే పత్రిక ప్రచురించింది. అబూసలేం తన భార్య 26 ఏళ్ల సయ్యద్ బహార్ కౌసర్ తోపాటు పలువురు ఫ్యామిలీ మెంబర్స్ ను ఆయన మీట్ అయినట్టు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. సెల్ ఫోన్ తో మాట్లాడుతూ కనిపించాడు కూడా!

అబూసలేంను తాను మ్యారేజ్ చేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కౌసర్ జూన్ నెలలో కోర్టును కోరింది. ఆ తర్వాత వీళ్ల పెళ్లి రైలులోని ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. కానీ లేటెస్ట్ పిక్స్ చూస్తే మాత్రం ఇద్దరూ ఎంచక్కా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఫోటోలు ఇప్పటివి కావని 2012-15 మధ్యలోవని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఏదైతేం.. ఓ వైపు జైలు లైఫ్.. మరోవైపు ఫ్యామిలీతో ఖుషీ అనే లెవెల్లో అబూ జీవితం సాగిపోతోంది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:భార్యని ముక్కలు చేసి.. ఆపై పెట్రోల్ పోసి ..

ఇవి కూడా చదవండి:నమ్మొద్దు .. నమ్మొద్దు.. మోడీని నమ్మొద్దు ...

English summary

Under world Gangster Abu Salem was arrested by police and recently one of the News Paper released the Photos of Abu Salem when he was enjoying with his wife in Railway Stations and He was also spotted by talking in Cell Phone.