కంపు కొడుతున్న ట్రంప్ వ్యాఖ్యలు ...

Donald Trump About Jobs In US

01:07 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Donald Trump About Jobs In US

నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి, తరచూ వివాదమవ్వడం కొందరికి ఖుషీ ఏమో గానీ ఆలాంటి వ్యాఖ్యలు కంపు కోడతాయని తెలీదు పాపం. అవే కొంప ముంచుతాయని ఆ తర్వాత గానీ తెల్సి రాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చక్రం తిప్పాలని మహా సంబర పడిపోతూ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి నానా హైరానా పడుతున్న వివాదాస్పద నేత డోనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. విదేశీ ఉద్యోగులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే హెచ్ -1బి వీసా వ్యవస్థను తప్పు పడుతున్నాడు. తాజాగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో పాల్గొన్న సందర్భంగా హెచ్-1బి వీసా వ్యవస్థను తప్పు పడుతూ వ్యాఖలు చేయడమే కాక, దీని వలన అమెరికన్ల ఉద్యోగ అవకాశాలకు కోత పడుతుందని సెలవిచ్చాడు.

ఎదుటి వాడికి చెప్పేందుకే నీతులు ఉన్నాయన్న చందంగా, పారిశ్రామివేత్తగా అమెరికన్ల ప్రయోనాల గురించి ఏనాడు ఆలోచించని డోనాల్డ్ ట్రంప్.. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పగలు రాత్రి అనే తేడా లేకుండా అమెరికన్లకు విద్వేషాన్ని నూరిపోయటం హేయనీయం. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా లో ఇలాంటి జాడ్యం వున్నవాళ్ళు వుంటే ప్రమాదం కాదు కాదు , అత్యంత ప్రమాదకరం అనే మాటలు అమెరికన్ల నుంచే వినవస్తున్నాయి. ఇలాంటి విద్వేషాలు రగిల్చేది ఓట్ల కోసమే అన్నది తేటలేల్లం అవుతోంది. లేకుంటే , ఇప్పుడు తప్పులుగా ఎత్తి చూపుతున్నదే.. నిన్నటి వరకూ డోనాల్డ్ ఆచరించలేదా ? అందుకే ఇప్పుడనే మాటలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పించి మరొకటి కాదని ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి వాడిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ప్రపంచం ఎంత అల్లకల్లోలం అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదనే మాట అందరి నోటా వస్తోంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే వ్యక్తి మొత్తంగా కాకున్నా ఎంతోకొంత అయినా.. విశాల దృక్ఫదం ఉండాల్సిన అవసరం ఉందన్న ఆలోచన లేకపోవడం శోచనీయం.

ఇక పారిశ్రామికవేత్తగా మాత్రం హెచ్ 1బి వీసాల పేరిట భారీగా ఉద్యోగుల్ని విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా తన దగ్గర పనికి పెట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ వ్యాపారస్తుడిగా హెచ్ 1 బి వీసాల వల్ల ప్రయోజనం పొంది, ఇప్పుడు మాత్రం అధికారంలోకి వస్తే హెచ్ 1 బి వీసాలకు చెల్లు చీటీ ఇస్తామనే విధంగా వ్యాఖ్యానించటం చూస్తే.. అతగాడి మైండ్ సెట్ ఇట్టే అర్థమవుతుంది. తనకు ప్రయోజనం కలిగితే సరిపోతుందన్న వైఖరి ట్రంప్ లో స్పష్టంగా కనిపిస్తోంది. .మరి.. ఈ విషయాన్ని అమెరికన్లు సీరియస్ గా ఆలోచిస్తారా? లేదా? అన్నది చూడాలి. సీరియస్ గా తీసుకుంటే మాత్రం డోనాల్డ్ ట్రంప్ కి అంతే సంగతులు ...

English summary

American President Republican candidate Donald Trump says that foreigners were stealing the jobs of Americans .He also said that there were mistakes in H1 B Visa procedure.