ఇరాక్, సిరియాలో ఇంటర్నెట్ ఆపండి: ట్రంప్

Donald Trump Asks To Shutdown Internet in Iraq,Syria

07:00 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Donald Trump Asks To Shutdown Internet in Iraq,Syria

ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయాలని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు సోషల్ మీడియాను ఎరగా వాడి యువకులను ఐఎస్ ఊబిలోకి లాగుతున్నారని చెప్పారు. మనల్ని, మన దేశాన్ని నాశనం చేయాలనుకునే మిలిటెంట్లు ఇంటర్నెట్ వాడుతున్నారని ఓ డిబెట్ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు ఇంటర్నెట్ మాధ్యమంగా వాడి ఐఎస్ గ్రూపులోకి చాలా మందిని రప్పించుకున్నారని, సామాన్య పౌరుల కంటే కూడా ఇస్లామిక్ మిలిటెంట్లు ఇంటర్నెట్ సేవల్ని బాగా వినియోగించుకుంటారని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ మేధావులు ఎలాగైనా శ్రమించి ఉగ్రసంస్థలు తమ సమాచారాన్ని కనిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీని వాడి ఐఎస్ఎస్ గ్రూపు ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది, వారు ఎటువంటి చర్యలకు పాల్పడనున్నారో అలాంటి విషయాలను మీరు ముందుగానే గుర్తించాలని ట్రంప్ సూచించారు. అయితే, రిపబ్లికన్ పార్టీకే చెందిన మరో అభ్యర్థి, ఓహియో గవర్నర్ జాన్ కసిక్ ఈ విషయాలను ఖండించారు. ఇంటర్నెట్ ను తొలగించాలనుకోవడం మంచి నిర్ణయమా అని ప్రశ్నించారు. ఇంటర్నెట్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలను గమనిస్తే ఆయన సీరియస్ అభ్యర్థి కాదని సెనెటర్ రాండ్ పాల్ అభిప్రాయపడ్డారు.

English summary

American Republic Party Leader Donald Trump says that to stop internet services in iraq and syria