నిజంగా ట్రంప్ ఫోర్స్ ఇది

Donald Trump Boeing airliner

11:55 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Donald Trump Boeing airliner

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తూనే వున్నారు. తాజాగా ఓ విమానం తో కూడా చర్చల్లోకి వచ్చారు. అన్ని వసతులతో కూడిన ఖరీదైన విమానం ఆయనకు ఉంది. ఆ విమానంలో సీటు బెల్టులకు 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారుపూత వుంటుంది. బాత్ రూంలోని కొళాయిలకు కూడా బంగారు పూత వుండటం విశేషం. సాధారణంగా బోయింగ్ విమానం కెపాసిటీ 200 మందికి పైగా వున్నా 43 మంది మాత్రమే ప్రయాణించేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీన్ని ట్రంప్ ఫోర్స్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ విమానాన్ని ట్రంప్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్లెన్ నుంచి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అనంతరం తన అభిరుచికి తగినట్టుగా డిజైన్ చేయించాడు. సమావేశ మందిరాలు, బెడ్ రూంలు, బాత్ రూంలు, లగ్జరీ సీట్లతో విమానంలో వసతులు కల్పించారు. ఇందులోనే ట్రంప్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలోనే...

అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అంటారు.క్షిపణుల దాడిని కూడా విమానం ఎదుర్కొనేందుకు వీలుంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం విలువ 325 మిలియన్ డాలర్లు కాగా ట్రంప్ విమానం విలువ 100 మిలియన్ డాలర్లు వుండటం విశేషం. దీంతో ట్రంప్ వినియోగిస్తున్న విమానానికి ట్రంప్ ఫోర్స్ వన్ అనేపేరుతో పిలుస్తున్నారట. అదీ కధ.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు పంపే 4 సూచనలు ఇవే!

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

English summary

Donald Trump personal Boeing airliner.