భారత్ ఉద్యోగులపై ట్రంప్‌ వ్యాఖ్యలు - హిల్లరీ ఫైర్

Donald Trump Comments On Indian Call Center Workers

11:05 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Donald Trump Comments On Indian Call Center Workers

మొదటి నుంచి రిపబ్లికన్‌ పార్టీ ఫ్రంట్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో నే నెట్టుకొస్తున్నాడు. మహిళల గురించి , భారతీయుల గురించి ... ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా తన వ్యాఖ్యలతో రోత పుట్టిస్తున్నాడు. తాజాగా భారత్‌ కాల్‌ సెంటర్ల గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్‌ తప్పుపట్టారు. భారతీయులకు మద్దతుగా నిలిచారు. ఇటీవల ట్రంప్‌ డెలవేర్‌లో ఎన్నికల ప్రచారంలో.. భారతీయ కాల్‌సెంటర్‌ ఉద్యోగులను అవహేళన చేస్తూ భారతీయ యాసలో ట్రంప్‌ మాట్లాడారు. అదే సమయంలో భారత్‌ గొప్పదేశం, అక్కడి నేతల పై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. ఇక్కడి ఉద్యోగాలు వారికెందుకు అప్పగించాలని, వలసవాద విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:షిర్డీ సాయి హుండీలో రూ. 92 లక్షల వజ్రాలు

ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపధ్యంలో ట్రంప్‌పై హిల్లరీ విమర్శలు గుప్పించారు. భారత్‌లో కాల్‌సెంటర్‌ ఉద్యోగులను అవహేళన చేస్తూ మాట్లాడటంతో ట్రంప్‌కు ఇతర కమ్యూనిటీల పట్ల గౌరవం లేదన్న విషయాన్ని తెలియజేస్తోందని హిల్లరీ క్లింటన్‌ ప్రచార విభాగం ఛైర్మన్‌ జాన్‌ పొడెస్టా పేర్కొన్నారు. మేరీల్యాండ్‌లోని జర్మన్‌టౌన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ట్రంప్‌ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, వేర్పాటువాద వైఖరితో ఉన్నాయని హిల్లరీ విమర్శించారు. ఇలాంటి వైఖరి దేశానికి ఎంతో ప్రమాదకరమ న్నారు. దేశానికి స్నేహితులు, పరస్పర సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. అలాగే భారతీయ అమెరికన్లు చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారని, గొప్ప లక్ష్యాలతో పనిచేస్తారని అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలతో తాను ఏమాత్రం ఏకీభవించనని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:భారతదేశంలో ఈ దేవునికి రూపం లేదు!

ఇవి కూడా చదవండి:మాల్యాను వెనక్కి రప్పించడం కష్టమా ?

English summary

Republic Party Front Presidential Candidate Donald Trump made some Controversial Comments on Indian Call Center Workers . He said that they were taking away Americans Jobs. This was opposed by another Presidential Candidate Hillari.