ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్.. ఇక హిల్లరీతో ఢీ

Donald Trump competition with Hillary

12:03 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Donald Trump competition with Hillary

అవును, ఇన్నాళ్లూ తన పదునైన మాటలతో దూసుకుపోతూ వస్తున్న, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిగా ఖరారయ్యాడు. క్లీవ్ లాండ్ సదస్సులో రాష్ట్రాల వారీగా నిర్వహించిన ఓటింగ్ లో ట్రంప్ విజయం సాధించడంతో అధ్యక్ష అభ్యర్థిత్వానికి మార్గం ఏర్పడింది. ఇక నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో ట్రంప్ పోటీ పడతాడు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలకెక్కిన ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా కూడా ఖరారవ్వడంతో పోటీ రంజుగా మారనుంది.

English summary

Donald Trump competition with Hillary